హోమ్ /వార్తలు /National రాజకీయం /

YS Sharmila చెంతకు జగన్ దూతగా! -షర్మిలతో వైవీ సుబ్బారెడ్డి భేటీ వెనుక రహస్యమేంటి? -పాదయాత్రలో అనూహ్య దృశ్యం

YS Sharmila చెంతకు జగన్ దూతగా! -షర్మిలతో వైవీ సుబ్బారెడ్డి భేటీ వెనుక రహస్యమేంటి? -పాదయాత్రలో అనూహ్య దృశ్యం

షర్మిల పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి

షర్మిల పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. వైసీసీలో టాప్-3 నేత అయిన సుబ్బారెడ్డి సడన్ గా తెలంగాణలో ప్రత్యక్షమై, షర్మిల పాదయాత్రకు రావడం, సంఘీభావం ప్రకటించడం వెనుక రహస్యం ఏమిటనేది ఉత్కంఠ రేపుతున్నది. షర్మిల పాదయాత్ర ఐదోరోజైన ఆదివారం నాగారంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది..

ఇంకా చదవండి ...

తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా టెన్షన్ క్రియేట్ చేసిన దృశ్యం ఇవాళ రంగారెడ్డి జిల్లా నాగారంలో చోటుచేసుకుంది. తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్ టీపీ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ప్రస్తుతం ‘ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేస్తుండటం తెలిసిందే. పాదయాత్ర ఐదోరోజైన ఆదివారం ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) చైర్మన్, వైసీపీ కీలక నేత, బాబాయి కూడా అయిన వైవీ సుబ్బారెడ్డి కలవడం చర్చనీయాంశమైంది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఐదోరోజు కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం నాగారం గ్రామంలో షర్మిల కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆమె బస చేసిన ప్రాంతానికి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వచ్చారు. షర్మిలతో సుబ్బారెడ్డి సుమారు గంటకుపైగా మాట్లాడారు.

అన్న వైఎస్ జగన్ తో విభేదాలు, పదవుల పంపిణీలో గొడవలను వైఎస్ షర్మిల బాహాటంగా అంగీకరించిన తర్వాత తల్లి విజయమ్మ కాకుండా వైఎస్ కుటుంబీకుల్లో షర్మిలను కలిసిన తొలి వ్యక్తి వైవీ సుబ్బారెడ్డే కావడం గమనార్హం. షర్మిల పాదయాత్రకు ఏపీకి చెందిన ప్రముఖ నేత రావడం కూడా ఇదే మొదటిసారి కావడంతో రెండు రాష్ట్రాల్లోనూ షర్మిల-వైవీ భేటీలపై ఆసక్తికర చర్చనడుస్తోంది.

షర్మిల సొంత పార్టీ పెట్టడాన్ని తొలి నుంచీ వ్యతిరేకించినవారిలో వైవీ సుబ్బారెడ్డి కూడా ఒకరు. పార్టీ ఆలోచనను విరమించుకోవాలని, కుటుంబం మాటను కాదని షర్మిల గనుక ముందుకెళితే, ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు ఉండబోవని సుబ్బారెడ్డి తెగేసి చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయనే నేరుగా తెలంగాణకు వచ్చి షర్మిల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం వెనుక రహస్యం ఏమై ఉంటుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీలోగానీ, కుటుంబంలోగానీ జగన్ గీసిన గీతను ఏనాడూ దాటని వైవీ సుబ్బారెడ్డి తనంతట తానుగా వచ్చి షర్మిలను కలిసే అవకాశమే లేదని, జగన్ పంపిన దూతగానే వైవీ.. షర్మిలను కలిసి ఉంటారనే వాదన వినిపిస్తోంది. త్వరలో ఏపీకి చెందిన ఇంకొదరు నేతలూ తెలంగాణకు వచ్చి షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలిపే అవకాశాలున్నట్లు సమాచారం.

Published by:Madhu Kota
First published:

Tags: Ys jagan, YS Sharmila, YV Subba Reddy

ఉత్తమ కథలు