Home /News /politics /

YS JAGAN TWEET ON RAM GOPAL VARMA LAKSHMIS NTR PRESS MEET IN VIJAYAWADA SB

విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేమా ? వర్మకు అండగా వైఎస్ జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఇటీవల తెలంగాణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

    విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాపై ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వర్మకు అండగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందన్నారు. పోలీసుల్ని బంట్టోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందన్నారు. చంద్రబాబు గారూ... ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి ? అని ప్రశ్నించారు.

    విజయవాడలో నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్‌లో చెప్పిన వర్మ...అనుకున్న ప్రకారం బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రెస్ మీట్‌కు పర్మిషన్ లేదన్నారు. వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఇటీవల తెలంగాణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు వర్మ. కానీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో వెనుతిరిగారు.

    First published:

    Tags: Andhra Pradesh, Lakshmis NTR, Laxmi's NTR, Ram Gopal Varma, Vijayawada, Ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు