ఏపీలో మరో కొత్త పథకం.. నేడే ప్రారంభించనున్న సీఎం జగన్..

ఏపీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పలు పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

news18-telugu
Updated: April 28, 2020, 6:22 AM IST
ఏపీలో మరో కొత్త పథకం.. నేడే ప్రారంభించనున్న సీఎం జగన్..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఏపీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పలు పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కారు నేడు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. దీన్ని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒకేసారి అందజేయనున్నారు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఏపీ సర్కారు చెబుతోంది. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది తల్లులు, వారి పిల్లలు లబ్ధి పొందుతారని వెల్లడించింది.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలిసిన ఫీజులు బకాయిలు లేకుండా ఒకే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తల్లులకు, వారి పిల్లల చదువుల కోసం కేవలం 11 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్లు ప్రభుత్వం అందిస్తుంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లించనుంది. ఇక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద మొత్తం రూ. 4వేల కోట్లకు పైగా విడుదల చేయనుంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 28, 2020, 6:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading