లోటస్‌పాండ్‌ను ఖాళీచేస్తున్న వైసీపీ? జగన్ వ్యూహం వెనక కారణమిదే

హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని పదే పదే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఐతే ఏపీలో తాను గెలిచే అవకాశాలున్నాయి కాటట్టి..ఇకపై టీడీపీ నేతలకు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నారు.

news18-telugu
Updated: May 13, 2019, 6:59 PM IST
లోటస్‌పాండ్‌ను ఖాళీచేస్తున్న వైసీపీ? జగన్ వ్యూహం వెనక కారణమిదే
వైఎస్ జగన్
news18-telugu
Updated: May 13, 2019, 6:59 PM IST
ఏపీ ఎన్నికల ఫలితాలకు మరో 10 రోజులు సమయముంది. ఏపీ భవిష్యత్ ఏంటో మే 23న తేలనుంది. చంద్రబాబు మరోసారి సీఎం పగ్గాలు చేపడతారా? 'జగన్ అను నేను'..అని వైసీపీ అధినేత ప్రమాణస్వీకారం చేస్తారా? ఏం జరుతుందనేది ఆ రోజునే తేలనుంది. చాలా వరకు సర్వేల్లో జగనే సీఎం అవుతారని తేలింది. అటు పార్టీ అంతర్గత సర్వేలోనూ వైసీపీయే అధికారంలోకి రాబోతోందని వెల్లడయింది. ఈ నేపథ్యంలో ఏపీలోకి పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయ్యేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు ముహూర్తం కూడా ఖరారయిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ నుంచి ఫర్నిచర్‌ను అమరావతికి తరలిస్తున్నారు. మే 23న ఫలితాలు రానుండగా అందుకు రెండు రోజుల ముందే జగన్ ఏపీకి వెళ్లబోతున్నారు. మే 21న మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజు నుంచి అమరావతిలోనే ఉండబోతున్నారు జగన్. విజయవాడలోని సొంత నివాసంలో ఆయన నివసించబోతున్నట్లు సమాచారం. ఇకపై అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వైఎస్ జగన్ పూర్తిగా ఏపీపైనే ఫోకస్ పెట్టారు. తెలంగాణ రాజకీయాల్లో కనీసం జోక్యం కూడా చేసుకోవడం లేదు. ఐనప్పటికీ వైసీపీ ప్రధాన కార్యాలయం మాత్రమే లోటస్ పాండ్ (హైదరాబాద్) కేంద్రంగానే నడుస్తోంది. రాజకీయ వ్యూహాలు, నిర్ణయాలన్నింటినీ అక్కడి నుంచే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని పదే పదే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఐతే ఏపీలో తాను గెలిచే అవకాశాలున్నాయి కాటట్టి..ఇకపై టీడీపీ నేతలకు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే లోటస్ పాండ్‌ నుంచి అమరావతికి మకాం మార్చాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం.First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...