నేడు కేసీఆర్, జగన్ భేటీ... సడెన్‌గా ఎందుకు? ఏం చర్చిస్తారు?

తెలంగాణలో ఓ వైపు మున్సిపోల్స్ హడావుడి, ఏపీలో అమరావతి వివాదం ఉండగా... ఏపీ సీఎం జగన్ వచ్చి... కేసీఆర్‌తో భేటీ కాబోతుండటం చర్చకు దారితీసింది.

news18-telugu
Updated: January 13, 2020, 5:39 AM IST
నేడు కేసీఆర్, జగన్ భేటీ... సడెన్‌గా ఎందుకు? ఏం చర్చిస్తారు?
వైఎస్ జగన్, కేసీఆర్
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ ఇవాళ భేటీ కాబోతున్నారు. ఈ మీటింగ్ ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరగబోతోంది. ఈ భేటీతో ఏదో జరిగిపోతుందని అనుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రధానంగా వీళ్లిద్దరూ రాష్ట్ర విభజన అంశాలు, రాజకీయ అంశాలపై చర్చించబోతున్నారు. ప్రధానంగా నీటి సమస్యపై చర్చించనున్నారు. గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్‌‌‌కు తరలించడానికి ఉమ్మడి ప్రాజెక్టు చేయాలనే విషయాన్ని ఇదివరకు చర్చించారు. ఇప్పుడు దానిపై మళ్లీ చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44000 క్యూసెక్కుల నుంచి 80000 క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా చర్చిస్తారని తెలిసింది. ఈ పెంపు నిర్ణయంపై తెలంగాణలో అభ్యంతరాలున్నాయి. ఇక రాష్ట్ర విభజన విషయాల్లో పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపైనా చర్చిస్తారని సమాచారం. చిత్రమేంటంటే ఇలాంటి సమావేశాలు జరిగేటప్పుడు... అధికారులు కూడా ఉంటారు. ఇవాళ్టి మీటింగ్‌లో మాత్రం వాళ్లు లేరు. దీన్ని బట్టి... రాజకీయ అంశాలపైనా చర్చ జరుగుతుందని అనుకోవచ్చు. వీళ్లిద్దరి మధ్యా మీటింగ్ జరిగి మూడున్నర నెలల గ్యాప్ వచ్చింది. అందువల్ల CAA, NRC, కేంద్రంతో సంబంధాలు, ఆర్టీసీ విలీనం, అమరావతి వివాదంపైనా చర్చిస్తారని తెలిసింది. పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతివ్వగా టీఆర్ఎస్ ఇవ్వలేదు. నెక్ట్సేంటి, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చ సాగే అవకాశాలున్నాయి.

First published: January 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు