జగన్‌తో కలిసి మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్...షెడ్యూల్ ఇదే

మధ్యాహ్నం 2 గంటలకు జగన్‌తో కలిసి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. సాయంత్రం జరిగే మోదీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం హోదాలో జగన్ పాల్గొంటారు.

news18-telugu
Updated: May 29, 2019, 6:07 PM IST
జగన్‌తో కలిసి మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్...షెడ్యూల్ ఇదే
జగన్, కేసీఆర్,మోదీ
news18-telugu
Updated: May 29, 2019, 6:07 PM IST
గురువారం నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవం ఢిల్లీలో జరగనుంది. సాయంత్రం 7గంటలకు 'నరేంద్ర దామోదర్ దాస్ అను నేను' అని ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి పలు దేశాధినేతలు, దేశంలోని రాజకీయ పార్టీల అధినేతలు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ కాబోయే సీఎం జగన్ సైతం మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం తన ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత..కేసీఆర్, జగన్ కలిసి ఒకే విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.

గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ బయలుదేరి వెళ్తారు. ఉదయంర్ 10 గంటల 55 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత గేట్ వే హోటల్‌లో విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు జరిగే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి గేట్ వే హోటల్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జగన్‌తో కలిసి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. సాయంత్రం జరిగే మోదీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం హోదాలో జగన్ పాల్గొంటారు.


First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...