‘నాయన’కు ప్రేమతో.. వైఎస్ఆర్ అంటే జగన్‌కు ఎంత ఇష్టమంటే..

YS Jagan swearing-in Ceremony: జగన్, వైఎస్ఆర్ వారి వారి పనుల్లో బిజీగా ఉండటం వల్ల నెలలో రెండు సార్లు కలవడం కూడా కష్టంగా ఉండేదట. ఒక్కోసారి తండ్రిని కలిసేందుకు జగన్ పనిగట్టుకొని బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినా కలుసుకోవడం మాత్రం సాధ్యం కాకపోయేదట.

Bommakanti Shravan | news18-telugu
Updated: May 30, 2019, 12:11 PM IST
‘నాయన’కు ప్రేమతో.. వైఎస్ఆర్ అంటే జగన్‌కు ఎంత ఇష్టమంటే..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటోలు)
Bommakanti Shravan | news18-telugu
Updated: May 30, 2019, 12:11 PM IST
ఎన్ని కోట్లున్నా, ఎన్ని పదవులు ఉన్నా.. మనవాళ్లు వెంట ఉంటే ఆ ఆనందమే వేరు. వారితో గడిపే కొన్ని క్షణాలైనా మధురమే. అందుకు ఏపీ సీఎం పదవి చేపట్టబోయే వైఎస్ జగన్ మినహాయింపు కాదు. ఆయనకు తన తండ్రి అంటే ఎనలేని ప్రేమ. ముఖ్యంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్న రోజుల్లో ఆయనతో కలిసి భోజనం చేయడానికి అమితంగా ఇష్టపడేవారు. చిన్నప్పటి నుంచే జగన్‌కు తండ్రి అంటే ఇష్టం. జగన్ పెద్దయ్యాక వ్యాపారరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. వైఎస్‌ఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఉండేవారు. ఇద్దరు వారి వారి పనుల్లో బిజీగా ఉండటం వల్ల నెలలో రెండు సార్లు కలవడం కూడా కష్టంగా ఉండేదట. ఒక్కోసారి తండ్రిని కలిసేందుకు పనిగట్టుకొని బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినా కలుసుకోవడం మాత్రం సాధ్యం కాకపోయేదట.

ఇద్దరు కలిస్తే మాత్రం.. తప్పకుండా కలిసే భోజనం చేసేవారట. జగనే దగ్గరుండి మరీ తన తండ్రికి ఇష్టమైన వంటకాలను కొసరి కొసరి వడ్డించేవారు. వైఎస్‌ఆర్‌ను జగన్.. ‘నాయన’ అని ప్రేమగా పిలిచేవారు. వైఎస్ఆర్ అకాల మరణం.. జగన్‌కు తీవ్ర వేదనను మిగిల్చింది.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...