ఏడేళ్లలో ఎంత మార్పు.. నాడు అరెస్టు.. నేడు ఏపీకి సీఎం

YS Jagan swearing-in Ceremony: ఏడేళ్ల క్రితం 2012 మే 27న అక్రమాస్తుల కేసులో జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఏడేళ్లు గడిచాయి.. ఇప్పుడు ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Bommakanti Shravan | news18-telugu
Updated: May 30, 2019, 1:03 PM IST
ఏడేళ్లలో ఎంత మార్పు.. నాడు అరెస్టు.. నేడు ఏపీకి సీఎం
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్
  • Share this:
పదేళ్లలో ఎన్నో కష్టాలు.. మరెన్నో ఇబ్బందులు.. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట 3648 కిలోమీటర్ల పాదయాత్ర.. చివరికి ప్రతిఫలం దక్కింది. ఏపీ సీఎం పీఠం కదిలి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను.. అంటూ బాధ్యతలు చేపట్టిన ఆయన్ను సరిగ్గా ఏడేళ్ల క్రితం 2012 మే 27న సీబీఐ అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది. ఏడేళ్లు గడిచాయి.. ఇప్పుడు ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆనాడు జగన్ అరెస్టును నిరసిస్తూ ఆయన కుటుంబసభ్యులు తల్లి విజయమ్మ, భార్య భారతీరెడ్డి, సోదరి షర్మిళ, బావ బ్రదర్ అనిల్ హైదరాబాద్‌లోని గవర్నర్ నరసింహన్ నివాసమైన రాజ్‌భవన్ ముందు ధర్నాకు దిగారు. అర్ధరాత్రి వరకు ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత కుటుంబ సభ్యలతో పాటు జగన్ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు.


ఏడేళ్ల మూడు రోజులకు ఏ గవర్నర్ నివాసం ముందైతే ఎవరికోసం న్యాయం చేయాలని కుంటుంబ సభ్యులు ఆందోళనకు దిగారో.. అదే గవర్నర్ నరసింహన్ ఆ వ్యక్తితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏడేళ్ళ నాటి ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్ అభిమానులు నెమరు వేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యం బలం ఏమిటో మరోసారి నిరూపితమైందని అంటున్నారు.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు