ఆ విషయంలో జగన్ కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి : పవన్ కల్యాణ్

భాషా పరిరక్షణ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు.

news18-telugu
Updated: November 10, 2019, 4:25 PM IST
ఆ విషయంలో జగన్ కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి : పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్, జగన్
news18-telugu
Updated: November 10, 2019, 4:25 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చివేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దానిపై స్పందించారు. భాషా పరిరక్షణ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా-సాంస్కృతిక శాఖ 2017లో ప్రచురించిన 'తొలిపొద్దు' కవితా సంకలనాన్ని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ సంకలనంలో 442మంది కవుల కవిత్వాన్ని ప్రచురించారు. తెలంగాణ ప్రభుత్వం 2017లో నిర్వహించిన తెలుగు మహాసభల సందర్భంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే.. జగన్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని
మండిపడుతున్నారు.

కాగా, ఇంగ్లీష్ మీడియంలో బోధనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగు భాష ఉనికి మరింత ప్రమాదంలో పడుతుందని కొంతమంది భాషా ప్రియులు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం,కొంతమంది మేదావి వర్గం మాత్రం వారి వాదనను తోసిపుచ్చుతున్నారు. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ విద్య అందవద్దన్న అక్కసుతోనే ఇలా గగ్గోలు పెడుతున్నారని వారు మండిపడుతున్నారు.మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివిస్తూ.. పేద,మధ్యతరగతి వర్గాల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలని కోరడం సరైందేనా? అని ప్రశ్నిస్తున్నారు.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...