ఏపీలో మహిళా మంత్రులకు సీఎం జగన్ షాక్..

13 జిల్లాల ఇన్‌చార్జి మంత్రులను చూస్తే.. అందరూ పురుషులే ఉన్నారు. ఒక్క మహిళా మంత్రికి కూడా ఇన్‌‌చార్జి మంత్రిగా అవకాశం దక్కలేదు.

news18-telugu
Updated: October 20, 2019, 9:11 PM IST
ఏపీలో మహిళా మంత్రులకు సీఎం జగన్ షాక్..
మేకతోటి సుచరిత, తానేటి వనిత, పుష్ప శ్రీవాణి
news18-telugu
Updated: October 20, 2019, 9:11 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఏపీలో 13 జిల్లాలకు కొత్తగా ఇన్‌చార్జి మంత్రులను జగన్ ప్రభుత్వం నియమించింది. 13 జిల్లాల ఇన్‌చార్జి మంత్రులను చూస్తే.. అందరూ పురుషులే ఉన్నారు. ఒక్క మహిళా మంత్రికి కూడా ఇన్‌‌చార్జి మంత్రిగా అవకాశం దక్కలేదు. జగన్ కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. వారిలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. మేకతోటి సుచరిత (హోంమంత్రి), పాముల పుష్పశ్రీవాణి (ఉప ముఖ్యమంత్రి), తానేటి వనిత (మహిళా శిశు సంక్షేమం) జగన్ కేబినెట్‌లో మంత్రులుగా సేవలు అందిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి నియమించిన ఇన్‌చార్జి మంత్రుల్లో ఆ ముగ్గురిలో ఒకరికి కూడా అవకాశం లభించలేదు. వీరితోపాటు జగన్‌కు చాలా దగ్గరగా ఉండే నేతలుగా పేరుపొందిన కొందరు మంత్రులకు కూడా ఛాన్స్ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు జిల్లాలో ఏ మేరకు అమలవుతున్నాయి? అనే అంశంపై సమీక్షలు నిర్వహించడానికి ఇన్‌చార్జి మంత్రులకు అధికారం ఉంటుంది. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు జిల్లాల్లో జాతీయ జెండాలను ఇన్‌చార్జి మంత్రులు ఎగురవేయనున్నారు.

శ్రీకాకుళం - కొడాలి నాని
విజయనగరం - వెల్లంపల్లి శ్రీనివాసరావు

విశాఖపట్నం - కురసాల కన్నబాబు
తూర్పుగోదావరి - మోపిదేవి వెంకటరమణ


పశ్చిమ గోదావరి -  పేర్ని నాని
కృష్ణా - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Loading...
గుంటూరు - చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
ప్రకాశం - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
నెల్లూరు - బాలినేని శ్రీనివాసరెడ్డి
కర్నూలు - అనిల్ కుమార్
కడప - ఆదిమూలపు సురేష్
అనంతపురం - బొత్స సత్యనారాయణ
చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి

మా చెల్లిమీద చెయ్యేస్తావా.. యువకుడిని రఫ్ఫాడించిన యువతి
First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...