జగన్‌లో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్.... రేపు తాడేపల్లిలో అతిముఖ్య నేతలతో భేటీ

వాస్తవానికి ఈ సమావేశం ముందే జరగాల్సి ఉండగా... కాస్త ఆలస్యమైంది. ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌తో ఈ భేటీని బుధవారం నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

news18-telugu
Updated: May 21, 2019, 7:54 AM IST
జగన్‌లో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్.... రేపు తాడేపల్లిలో అతిముఖ్య నేతలతో భేటీ
వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలో ఎగ్జిట్ ఫలితాలు జోష్ నింపాయి. దీంతో ఆయన కాస్త హుషురుగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో తమదే అధికారం అన్న ధీమా జగన్‌లో కనిపిస్తోంది. అందుకే ఆయన రేపు ( బుధవారం) తాడేపల్లిలో ఓ సమావేశం నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. పార్టీకి చెందిన అతి తక్కువ మంది నేతలతో పాటు... అతి ముఖ్యమైన నేతలతో ఆయన ఈ భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సమావేశం ముందే జరగాల్సి ఉండగా... కాస్త ఆలస్యమైంది. ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌తో ఈ భేటీని బుధవారం నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మారిన షెడ్యూలు ప్రకారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని జగన్ సమీక్షిస్తారు. ఇందుకోసం రేపు సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. అత్యంత ముఖ్యమైన నేతలతో సమావేశం అవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ, స్థానిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై విశ్లేషిస్తారు.

జాతీయ చానళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో టీడీపీ-వైసీపీ మధ్య ఓట్ల శాతం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడదే విషయం వైసీపీ నేతల్లో చర్చకు కారణమైంది. ఈసారి పోల్‌మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు వెనకబడ్డారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మరి అదే సమయంలో జాతీయ చానళ్లు చెబుతున్నట్టు ఇరు పార్టీల మధ్య ఓట్ల శాతంలో అంత తేడా ఉండే అవకాశం లేదంటున్నారు. జాతీయ చానళ్లు చెబుతున్నట్టు 5 నుంచి 10 శాతం ఓట్ల తేడా అంటే ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని, కానీ బూత్ స్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.దీంతో ఈ విషయాలన్నింటిపై కీలకంగా మాట్లాడేందుకు జగన్ పార్టీకి చెందిన పలువురు నేతలతో సీరియస్‌గా మంతనాలు చేయనున్నారు. అదేవిధంగా కౌంటింగ్ రోజు ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా ఆయన చర్చలు జరపునున్నట్లు సమాచారం.
Published by: Sulthana Begum Shaik
First published: May 21, 2019, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading