YSRCP - NDA: ఎన్డీయేలో వైసీపీ చేరికపై బీజేపీ నుంచి ఫస్ట్ రెస్పాన్స్

'ఏపీలో వైసీపీ, టీడీపీతో బీజేపీ కలిసే పరిస్థితి లేదు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం స్పష్టతతో ఉంది. ’ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: October 6, 2020, 10:47 PM IST
YSRCP - NDA: ఎన్డీయేలో వైసీపీ చేరికపై బీజేపీ నుంచి ఫస్ట్ రెస్పాన్స్
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి
  • Share this:
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీయేలో చేరుతోందంటూ గత రెండు రోజులుగా మీడియాలో హోరెత్తిపోయింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో ఈ ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. అయితే, ప్రధానితో భేటీ తర్వాత మళ్లీ ఆ అంశం చల్లబడింది. అసలు ఇంతకీ ఎన్డీయేలోకి వైసీపీ చేరుతుందా? ఎన్డీయేలోకి రావాలని బీజేపీ వైసీపీని ఒత్తిడి చేస్తుందా? లేకపోతే ఢిల్లీ వెళ్లే సమయంలో వైసీపీనే బీజేపీ తమను ఆహ్వానిస్తోందనే ప్రచారం చేసుకుంటుందా? అసలు బీజేపీ, వైసీపీ పొత్తు ఉంటుందా? అనే అంశాలపై బీజేపీ నుంచి తొలిసారి స్పందన వచ్చింది. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ దీనిపై స్పందించారు. 'ఏపీలో వైసీపీ, టీడీపీతో బీజేపీ కలిసే పరిస్థితి లేదు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం స్పష్టతతో ఉంది. జగన్‌ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎన్డీఏలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్‌లోకి రమ్మన్నారని వైసీపీనే ప్రచారం చేస్తోందని నాకు అనుమానం కలుగుతోంది. సీబీఐ కేసుల నేపథ్యంలో రకరకాల అంశాలు తెరపైకి తెస్తున్నారు. మోదీ సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా ఉండాలో.. వైసీపీ ప్రభుత్వంతోనూ అలానే ఉంటుంది' అని మాధవ్ స్పష్టం చేశారు.

నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ 40 నిమిషాల పాటు సాగింది. ప్రధానంగా ఈ భేటీ... రాష్ట్ర అభివృద్ధి అంశాలే అజెండాగా సాగినట్లు తెలిసింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయం, జీఎస్టీ చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, దిశ సహా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న ఏపీ బిల్లులు వంటి 17 అంశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఎన్డీయేలోకి కొత్త మిత్రులను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్న బీజేపీ.. వైసీపీని ఎన్డీయేలో చేరాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో శివసేన, ఇటీవల వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అకాళీదల్.. ఎన్డీయేకు దూరమయ్యాయి. దీంతో తమ కూటమిలోకి కొత్త మిత్రులను తీసుకురావాలని బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమతో స్నేహంగా ఉంటున్న వైసీపీని ఎన్డీయేలోకి తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఈ దిశగా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎన్డీయేలో చేరితే రెండు కేంద్రమంత్రి పదవులతో పాటు ఒక సహాయమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమని బీజేపీ జాతీయ నాయకత్వం ఆఫర్ చేసినట్టు ప్రచారం జరిగింది.

మొదటి నుంచి అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న వైసీపీ ప్రధాని మోదీ వద్ద కూడా అదే అంశాన్ని చెప్పినట్టు తెలిసింది. కేంద్రంలో చేరకుండా బయట నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు ప్రత్యేక హోదా సహా వివిధ అంశాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వకుండా ఎన్డీయేలో చేరితే విపక్షాలకు టార్గెట్ అవుతామనే భావనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 6, 2020, 10:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading