YS JAGAN PETITION IN HIGH COURT TO PROBE YS VIVEKANANDA MURDER CASE BY INDEPENDENT AGENCY SK
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై హైకోర్టులో జగన్ పిటిషన్
వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ జగన్
వివేకానందరెడ్డి హత్యకేసు సీబీఐతోనే దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనీల్ ఆ పిటిషన్ వేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ విచారణ చేపట్టాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేస్తేనే న్యాయం జరుగుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహ ఎనిమిది మంది ప్రతివాదులుగా చేర్చారు జగన్. వివేకానంద హత్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని..రాజకీయ ప్రయోజనాల కోసం హత్యను వాడుకుంటున్నారని ఆరోపించారు. సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిగితే అసలు వాస్తవాలు బహిర్గమవుతాయని చెప్పారు.
వివేకానందరెడ్డి హత్యకేసు సీబీఐతోనే దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనీల్ ఆ పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై తమకు నమ్మకం లేదని ఆయన అన్నారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించి, అసలు దోషులకు శిక్ష పడేలా చెయ్యాలని హైకోర్టులో కోరారు.
మరోవైపు నాలుగు రోజులుగా సిట్ అధికారులు, పులివెందుల పోలీసులు వివేకానంద రెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 20 మందికి నిందితులను ప్రశ్నించి, ఆధారాలు సేకరించారు. వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డిని విచారించి పలు కీలక విషయాలను కూపీలాగినట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వివేకానందను హతమార్చేందుకు ఉపయోగించిన వేటకొడవలిని సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ హైకోర్టును ఆశ్రయించడం హాట్‌టాపిక్‌గా మారింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.