మే 30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం...మరి మంత్రులు?

సీనియారిటీ, ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకు కొంత సమయం పట్టే అవకాశముండడంతో..మొదట ఆయనొక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

news18-telugu
Updated: May 24, 2019, 1:49 PM IST
మే 30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం...మరి మంత్రులు?
మేనిఫెస్టోను తాను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌లా భావిస్తానని జగన్ అన్నారు.
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 'జగన్ అను నేను'.. అంటూ ప్రమాణ స్వీకారం చేసేందుకు వైసీపీ అధినేత సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30న విజయవాడలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఐతే ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కసరత్తులు కొనసాగుతున్నాయి. సుమారు 20 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని అధికారులకు జగన్ సూచించారు. చిన అవుట్‌పల్లి సిద్దార్థ మెడికల్ కాలేజీ ఎదుట ఖాళీ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడైతే ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటుందని అధికారులు చెప్పారు.

మరోవైపు మే 30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే మంత్రులను ఎంపిక చేయనున్నారు జగన్. సీనియారిటీ, ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకు కొంత సమయం పట్టే అవకాశముండడంతో..మొదట ఆయనొక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారని సమాచారం.

First published: May 24, 2019, 1:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading