సీఎంగా జగన్ తొలి సంతకం పెట్టబోయే ఫైల్స్ ఇవే..

వైఎస్ జగన్

YS Jagan mohan Reddy | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజు సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన పలు హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు.

 • Share this:
  ఈనెల 30న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజు సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన పలు హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి సీఎం అయినప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ పైల్ మీద తొలి సంతకం చేశారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంతకం పెట్టబోయే ఫైళ్లు ఇవే.

  1.రాష్ట్రంలో మహిళలకు డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ

  2. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు 45 సంవత్సరాలకే రూ.3000 పెన్షన్, వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు కూడా

  3. ప్రతి రైతుకు ఉచితంగా బోర్లు వేయిస్తాం

  4. వైఎస్ఆర్ పెళ్ళికానుక కింద రూ.లక్ష

  5. ఆరోగ్యశ్రీ కింద రూ.1000 పైనుంచి ఎన్ని లక్షల రూపాయల వరకు ఖర్చు అయినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స జరిగిగా ప్రభుత్వమే భరిస్తుంది

  6. ప్రతి ఇంటిలో పిల్లల్ని బడికి పంపిస్తే ఏటా రూ. 15000

  7. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం ప్రతి ఏటా రూ.12,500

   
  First published: