హోమ్ /వార్తలు /రాజకీయం /

జగన్ దూకుడు.. ఏపీ డీజీపీ బదిలీ.. కొత్త పోలీస్ బాస్‌గా గౌతమ్ సవాంగ్

జగన్ దూకుడు.. ఏపీ డీజీపీ బదిలీ.. కొత్త పోలీస్ బాస్‌గా గౌతమ్ సవాంగ్

జగన్మోహన్ రెడ్డి, ఏపీ డీజీపీ ఠాకూర్ (File)

జగన్మోహన్ రెడ్డి, ఏపీ డీజీపీ ఠాకూర్ (File)

ఏపీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ను తప్పించి గౌతమ్ సవాంగ్‌కు బాధ్యతలు అప్పగించారు కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి.

    ఆంధ్రప్రదేశ్‌లో తనదైన మార్క్ పాలనను జగన్ మోహన్ రెడ్డి అప్పుడే ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే కీలక శాఖలకు చెందిన ముఖ్య అధికారులను బదిలీ చేశారు. ఇప్పుడు రాష్ట్ర డీజీపీని కూడా మార్చేశారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో నిన్నటి వరకు విజయవాడ పోలీస్ కమిషనర్‌‌గా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌‌ను డీజీపీగా నియమించారు. దీంతోపాటు ఏపీ ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కుమార్ విశ్వజీత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్‌ను నియమించారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోగ్యరాజ్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓఎస్టీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమించారు.

    First published:

    Tags: AP DGP, Gautam Sawang, Ys jagan mohan reddy

    ఉత్తమ కథలు