ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైెస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 30 న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానాకి పలువురు ప్రముఖుల్ని వైసీపీ ఆహ్వానించనుంది. రేపు జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈనెల 25న వైసీపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఈ మీటింగ్ జరగనుంది. మే 30న ఏకాదశి కూడా కావడంతో మంచిరోజుని భావించి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ జాతక ప్రకారం కూడా ఆ రోజు బావుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహుర్తంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీతో కూడా జగన్ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.
ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. పలుజిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. ఎక్కడికక్కడ పార్టీ నాయకులంతా సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చుుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
Ummareddy Venkateswarlu, YSRCP: YS Jaganmohan Reddy to take oath as Andhra Pradesh Chief Minister on May 30
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.