‘జగన్ అను నేను’ ఈనెల 30న తిరుపతిలో ప్రమాణ స్వీకారం

ఎన్నికల ప్రచారం నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం వరకు తిరుపతి సెంటిమెంట్‌ను జగన్ ఫాలో అయ్యారు.

news18-telugu
Updated: May 23, 2019, 1:41 PM IST
‘జగన్ అను నేను’ ఈనెల 30న తిరుపతిలో ప్రమాణ స్వీకారం
AP Lok Sabha Results: ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ సునామీ (జగన్ ఫేస్‌బుక్ ఫోటో)
news18-telugu
Updated: May 23, 2019, 1:41 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 30న తిరుపతిలో వెంకన్న సాక్షిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి తిరుపతిలో తారకరామ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 2019 ఎన్నికలకు సంబంధించిన తిరుమల వెంకన్న సాక్షిగా తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. ఫిబ్రవరి 6న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతిలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత 13 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు (ఏప్రిల్ 9) సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని కూడా దర్శించుకున్నారు. మొత్తం మీద ఎన్నికల ప్రచారం నుంచి సీఎంగా ప్రమాణ  స్వీకారం వరకు తిరుపతి సెంటిమెంట్‌ను జగన్ ఫాలో అయ్యారు.

ఈనెల 30న దివ్యమైన ముహుర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఆరోజు ఏకాదశి కావడంతో ... జగన్ సీఎంగా అదేరోజు బాధ్యతలు తీసుకుంటే మంచిందని తెలుస్తోంది. ప్రమాణస్వీకారానికి సంబంధించిన ముహుర్తంపై ఇప్పటికే జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో మాట్లాడినట్లు తెలుస్తోంది.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...