ఏపీలో బంపర్ మెజార్టీతో విక్టరీ సాధించిన జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మే 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10.30కు గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఉన్న జగన్ క్యాంప్ ఆఫీస్‌లో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం (YCLP) జరగనుంది. ఆ సమావేశంలో జగన్‌ను ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. తర్వాత మధ్యాహ్నం జగన్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతుంది.
గవర్నర్‌తో భేటీ ముగిసిన తర్వాత తెలంగాణ సీఎంను కలుస్తారు జగన్. రాజ్‌భవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్‌తో సమావేశమవుతారు. ఈనెల 30న జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానిస్తారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలను కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. అటు ఆదివారం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతోనూ వైఎస్ జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.