అమరావతిలో వైసీపీ కొత్త ఆఫీస్... ఎక్కడో తెలుసా...

ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అమరావతిలోని తాడేపల్లిలోని తన కొత్త నివాసంలో అడుగుపెట్టిన సీఎం జగన్... తన నివాస ప్రాంగణంలోని మరో భవనాన్ని పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించాలని భావించారు.

news18-telugu
Updated: July 13, 2019, 11:47 AM IST
అమరావతిలో వైసీపీ కొత్త ఆఫీస్... ఎక్కడో తెలుసా...
వైసీపీ కొత్త ఆఫీస్
news18-telugu
Updated: July 13, 2019, 11:47 AM IST
అమరావతిలో వైసీపీ కొత్త పార్టీ ఆఫీస్ శరవేగంగా ముస్తాబవుతోంది. ఐదు అంతస్తుల భవనంలో వైసీపీ కొత్త కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటికే ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం సమీపంలోనే ఈ కొత్త కార్యాలయం ఉంది. నిజానికి ఎన్నికలకు ముందు వరకు వైసీపీ పార్టీ కార్యకలాపాలు హైదరాబాద్‌లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ నుంచే కొనసాగించారు. అయితే ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అమరావతిలోని తాడేపల్లిలోని తన కొత్త నివాసంలో అడుగుపెట్టిన సీఎం జగన్... తన నివాస ప్రాంగణంలోని మరో భవనాన్ని పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించాలని భావించారు.

అయితే తాజాగా ఆ కార్యాలయాన్ని తన క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకోవాలని జగన్ నిర్ణయించడంతో... పార్టీ కార్యకలాపాల కోసం మరో భవనాన్ని ఎంచుకుంది వైసీపీ. తాడేపల్లిలోని జగన్ నివాసం సమీపంలో ఉన్న ఓ భవనం ఇందుకు అనువుగా ఉందని భావించారు. ఆ భవనం ఓ వైసీపీ నాయకుడిది కావడం... పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు ఇచ్చేందుకు ఆయన అంగీకరించడంతో త్వరలోనే కొత్త కార్యాలయం నుంచి వైసీపీ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. భవనం నిర్మాణం దాదాపుగా పూర్తి కావడంతో... ఫర్నీచర్ సహా ఇతర హంగులను సమకూర్చే పనిలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. త్వరలోనే వైసీపీ కొత్త కార్యాలయానికి పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రారంభిస్తారని సమాచారం.






First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...