‘గెలిచేశాం.. ధ్యాంక్యూ’.. ప్రశాంత్ కిశోర్‌ అండ్ టీమ్‌తో జగన్

వైసీపీ కోసం తెరవెనుక పనిచేసిన ప్రశాంత్ కిశోర్, ఐప్యాక్ బృందాన్ని జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.

news18-telugu
Updated: April 12, 2019, 6:09 PM IST
‘గెలిచేశాం.. ధ్యాంక్యూ’.. ప్రశాంత్ కిశోర్‌ అండ్ టీమ్‌తో జగన్
ఐప్యాక్ ఆఫీసులో ప్రశాంత్ కిశోర్‌తో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. పార్టీ అంతర్గత చర్చల్లో వైసీపీకి 110 నుంచి 130 సీట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ కోసం తెరవెనుక పనిచేసిన ప్రశాంత్ కిశోర్, ఐప్యాక్ బృందాన్ని జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి వైఎస్ జగన్ వెళ్లారు. అక్కడ ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రతి ఒక్కరినీ పలకరించారు. ఎన్నికలకోసం పనిచేసిన అందరికీ కృతజజ్ఞతలు తెలిపారు. ప్రశాంత్ కిశోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ.. వైసీీపీ కోసం గత రెండేళ్లకు పైగా సేవలు అందిస్తోంది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక, వైసీపీలో అంతర్గత సర్వేలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అన్ని అంశాల్లోనూ సహకారం అందించింది.

ఐప్యాక్ కార్యాలయంలో ఉద్యోగులతో వైఎస్ జగన్ ముచ్చట్లు


ఈ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డితో పాటు ప్రశాంత్ కిశోర్‌ను టీడీపీ టార్గెట్ చేసింది. రాష్ట్రాన్ని మరో బీహార్‌గా మార్చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడు పరోక్షంగా ప్రశాంత్ కిశోర్ మీద మండిపడ్డారు. ప్రశాంత్ కిశోర్ పేరుతో కొన్ని నకిలీ సర్వేలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో స్వయంగా ప్రశాంత్ కిశోర్ కూడా చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ‘బైబై బాబు’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సేవలను అందిస్తూనే రాజకీయ ఆరంగేట్రం కూడా చేశారు. బీహార్‌లో అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్‌లో చేరారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండిFirst published: April 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>