సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఆమె ఇంట్లో వైఎస్ఆర్ ఫోటోను చూసి ఆశ్చర్యపోయారు. విజయనిర్మల పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం... ఆమె భర్త, నటుడు కృష్ణను పరామర్శించారు సీఎం జగన్. ఆ తరువాత జగన్‌కు ఇంట్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను చూపించారు విజయనిర్మల తనయుడు, సినీనటుడు నరేశ్. విజయనిర్మలకు వైఎస్ఆర్ అంటే ఎంతో అభిమానమని... అందుకే ఆ ఫోటో ఎప్పుడూ కనిపించేలా హాల్లో పెట్టారని వైఎస్ జగన్‌కు వివరించారు నరేశ్.
విజయనిర్మల నివాసంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో
విజయనిర్మల నివాసంలో వైఎస్ఆర్ ఫోటోను చూసిన సీఎం జగన్ ఆశ్చర్యానికి లోనయ్యారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని విజయనిర్మల ఎంతగానో కోరుకున్నారని... ముఖ్యమంత్రి అయిన తరువాత మిమ్మల్ని కలవాలని అనుకున్నారని జగన్‌కు నరేశ్ తెలిపారు. అయితే ఈలోపే ఇలా జరిగిపోయిందని భావోద్వేగానికి లోనయ్యారు. నరేశ్‌ను సీఎం జగన్ ఓదార్చారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.