Home /News /politics /

లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం... చంద్రబాబుపై జగన్ ఫైర్

లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం... చంద్రబాబుపై జగన్ ఫైర్

ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి (File)

ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి (File)

బాబు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ఏపీ రైతులు దేశంలోనే అత్యధిక రుణ భారంతో ఉన్నారన్నారు జగన్.

  బాబు వస్తే జాబ్ వస్తుందన్న చంద్రబాబు.. తన కుమారుడు లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం కల్పించారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్... చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు వల్ల లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం వచ్చిందన్నారు. జాబు రావాలంటే బాబు పోవాలన్నారు జగన్. నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారంటూ ప్రశ్నించారు. డిగ్రీలు పూర్తయినా నిరుద్యోగులు వలసలు పోతున్నారని విమర్శించారు. బాబు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ఏపీ రైతులు దేశంలోనే అత్యధిక రుణ భారంతో ఉన్నారన్నారు. చంద్రబాబు బాగుంటే.. రాష్ట్రం బాగున్నట్లేనా అంటూ ధ్వజమెత్తారు జగన్. చంద్రబాబు ఇచ్చే మూడువేలకు ఆశపడి ఓట్లు వేయోద్దని జగన్ పిలుపునిచ్చారు.

  ఎన్నికల నాటికి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు జగన్. ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్రంలో ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానన్నారన్నారు. ప్రతి జనవరిలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం క్యాలెండర్‌ను విడుదల చేస్తానన్నారు. సంక్షేమ పథకాల బాధ్యత వాలంటీర్లకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో పదిమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రారంభిస్తామన్నారు. ప్రతీ గ్రామంలో సచివాలయం తెరుస్తామన్నారు. చంద్రబాబు చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోదన్నారు జగన్. అధికారంలోకి రాగానే రైతు పెట్టబడి కింద రూ.50వేల ఇస్తామన్నారు. పిల్లల చదువుల ఖర్చులు ఆయననే భరిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ నవరత్నాల పథకాన్ని చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారని ఆరోపించారు జగన్. మోసం చేయడానికి చంద్రబాబు చూపించని సినిమా ఉండదంటూ ఎద్దేవా చేశారు.
  First published:

  Tags: Anantapur S01p19, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Chandrababu naidu, Ys jagan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు