• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YS JAGAN MOHAN REDDY SETTLED JAMMALAMADUGU ISSUE IN YSRCP PROMISED TO GIVE MLC TICKET FOR EX MINISTER RAMASUBBA REDDY AK

‘జమ్మలమడుగు’ పంచాయతీకి చెక్ పెట్టిన సీఎం జగన్.. మాజీమంత్రికి క్లారిటీ

‘జమ్మలమడుగు’ పంచాయతీకి చెక్ పెట్టిన సీఎం జగన్.. మాజీమంత్రికి క్లారిటీ

ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

జమ్మలమడుగులో రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయబోయేది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనే విషయాన్ని రామసుబ్బారెడ్డికి సజ్జల స్పష్టం చేశారు.

  • Share this:
    వైసీపీలో జమ్మలమడుగు పంచాయతీకి తెరపడింది. గతేడాది మార్చిలో టీడీపీ నుంచి మాజీమంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి జమ్మలమడుగు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. జమ్మలమడుగులోని రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులో రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయబోయేది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనే విషయాన్ని రామసుబ్బారెడ్డికి సజ్జల స్పష్టం చేశారు.

    సుధీర్ రెడ్డి వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీతో ఉన్నారని.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారని అన్నారు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లోనూ జమ్మలమడుగు సీటు సుధీర్ రెడ్డికే ఇవ్వనున్నట్టు రామసుబ్బారెడ్డికి క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని వైసీపీ నాయకత్వం హామీ ఇచ్చింది. 2023లో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని తెలిపింది. తనకు వైసీపీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తామని సీఎం జగన్ చెప్పారని మాజీమంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని వెల్లడించారు. మొత్తానికి కొంతకాలంగా కడప జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న రాజకీయ విభేదాలకు వైసీపీ నాయకత్వం తొందరగానే ముగింపు పలికినట్టు అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు