ప్రశాంత్ కిశోర్‌కు జగన్ ఆఫర్.. పీకే ఎస్ అంటారా? నో అంటారా?

‘ఏపీకి మీరు సీఎం కావాలి. మంచి పరిపాలన అందించాలి.’ అని ఆకాంక్షించారు. దీంతో ఆ సుపరిపాలన అందించేందుకు పీకే కూడా తమ జట్టులో ఉంటే బావుంటుందని జగన్ అనుకుంటున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: May 6, 2019, 1:11 PM IST
ప్రశాంత్ కిశోర్‌కు జగన్ ఆఫర్.. పీకే ఎస్ అంటారా? నో అంటారా?
ప్రశాంత్ కిశోర్, వైఎస్ జగన్
  • Share this:
ఐప్యాక్ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గత మూడేళ్లుగా పీకే నేతృత్వంలోని ఐప్యాక్ బృందం వైసీపీ కోసం పనిచేస్తుంది. గతనెల 11న జరిపి ఎన్నికల్లో వైసీపీ వ్యూహం బాగా వర్కవుట్ అయినట్టు అంతా భావిస్తున్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని అంతా ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ కూడా ప్రశాంత్ కిశోర్‌కు ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. తమ బంధం ఎన్నికల వరకే కాకుండా, ఎన్నికల తర్వాత కూడా కొనసాగాలని ఆకాంక్షించినట్టు సమాచారం. అంటే, ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే.. ఆ తర్వాత కూడా పీకే టీమ్ తమ కోసం పనిచేయాలని కోరినట్టు తెలిసింది. పార్టీ తరఫున ఎప్పటికప్పుడు సర్వేలు, ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది? ఏయే నేతల్లో ప్రజలపై సదభిప్రాయం ఉంది? వంటి అంశాలను ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా జగన్ మోహన్ రెడ్డికి అందించింది పీకే టీమ్. పార్టీ తరఫున సర్వేలు, పీకే టీమ్ సర్వేలను బేరీజు వేసుకుంటూ నడిచారు వైఎస్ జగన్. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం పనితీరును ఎప్పటికప్పుడు తమకు తెలియజేసేలా పీకే టీమ్ ఉంటే బావుంటుందని జగన్ అభిప్రాయపడినట్టు తెలిసింది.

ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి ప్రశాంత్ కిశోర్, ఆయన బృందానికి థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్.. ‘ఏపీకి మీరు సీఎం కావాలి. మంచి పరిపాలన అందించాలి.’ అని ఆకాంక్షించారు. దీంతో ఆ సుపరిపాలన అందించేందుకు పీకే కూడా తమ జట్టులో ఉంటే బావుంటుందని జగన్ అనుకుంటున్నట్టు సమాచారం. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తాను ఎవరికీ సేవలు కొత్తగా అందించడం లేదని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. గతంలో ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారం తాను వైసీపీకి మాత్రం సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. మరి జగన్ ప్రతిపాదనకు ప్రశాంత్ కిశోర్ ఓకే అంటారా? లేకపోతే నో అంటారా చూడాలి.

First published: May 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>