నారా లోకేష్‌ను ఓడించిన ఎమ్మెల్యేకు కీలక పదవి ఇవ్వనున్న జగన్ ?

జగన్ తన కేబినెట్‌లో ఆళ్లకు అవకాశం కల్పించలేదు. దీంతో తనకు మంత్రి పదవి వస్తుందని భావించినా ఆళ్ల కాస్త నిరాశ పడ్డారు. దీంతో ఇప్పుడు ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు వైసీపీ అధినేత.

news18-telugu
Updated: June 13, 2019, 9:55 AM IST
నారా లోకేష్‌ను ఓడించిన ఎమ్మెల్యేకు కీలక పదవి ఇవ్వనున్న జగన్ ?
లోకేష్, జగన్
  • Share this:
తాజగా జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై పోటీ చేసి గెలుపొందారు వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే ఆయనకు అంతా మంత్రి పదవి దక్కుతుందని భావించినా.. అది జరగలేదు. జగన్ తన కేబినెట్‌లో ఆళ్లకు అవకాశం కల్పించలేదు. దీంతో తనకు మంత్రి పదవి వస్తుందని భావించినా ఆళ్ల కాస్త నిరాశ పడ్డారు. దీంతో ఇప్పుడు ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి. కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని భావించినా, వివిధ సమీకరణాల కారణంగా పదవులు వరించని పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కీలక పదవులను పంచుతున్నారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఖరారు చేశారు.

తాజాగా, మంగళగిరిలో మాజీ మంత్రి నారా లోకేశ్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే, మంత్రి పదవిని ఇస్తానని జగన్ ప్రజల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన జగన్ క్యాబినెట్ లో ఉంటారని భావించినా, అది కాస్త కొన్ని విషయాల వల్ల కుదర్లేదు. దీంతో ఆళ్లకు సీఆర్డీయేను అప్పగించాలని జగన్ భావించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరో రెండు రోజుల్లో జగన్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం. దీనిపై సీఎం అధికారులకు ఉత్తర్వులు వెలువడనున్నాయి.
First published: June 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading