చంద్రబాబుకు పెద్ద పరీక్ష పెడుతున్న జగన్

ముఖ్యనేతలు పార్టీ వీడకుండా ఉండేలా చూసుకోవడం చంద్రబాబుకు పెద్ద పరీక్షగా మారనుందనే ప్రచారం కూడా సాగుతోంది.

news18-telugu
Updated: June 9, 2020, 6:38 PM IST
చంద్రబాబుకు పెద్ద పరీక్ష పెడుతున్న జగన్
దేశంలో నమోదయ్యే కేసులలో 13% ఏపిలోనే ఉన్నాయని..డిశ్చార్జ్ అయ్యేవాళ్లకు రూ. 2వేలు, మృతుల అంత్యక్రియలకు రూ. 15వేలు, ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు రూ. 50లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం... ఎవరికీ రూపాయి ఇవ్వడం లేదని ఆరోపించారు.
  • Share this:
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతున్నా... రాజకీయ వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. పరిపాలనపై పట్టు సాధిస్తూనే... ప్రత్యర్థి పార్టీని దెబ్బకొట్టడంపై సీఎం జగన్ గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి నేతలను ఆకర్షించడంపై వైసీపీ దృష్టి పెడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా వైసీపీలో చేరకున్నా... జగన్‌కు కొడుతున్నారు. ఈ జాబితాలో మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారనే ఊహాగానాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల్లో టీడీపీకి వెన్నుదన్నుగా ఉండే నేతలను ఆకర్షించడంపై ఫోకస్ పెట్టిన వైసీపీ... ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు, తన కుమారుడు సుధీర్‌తో కలిసి వైసీపీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఎమ్మెల్యేలతో పాటు మరోవైపు టీడీపీకి చెందిన ముఖ్యనేతలను ఆకర్షించడం ద్వారా చంద్రబాబును రాజకీయంగా మరింత ఇబ్బంది పెట్టే వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తోందని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.

మార్చిలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ... ఆ ఎన్నికలు మళ్లీ జరిగే నాటికి టీడీపీ నుంచి అధికార పార్టీలోకి మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు ముఖ్యనేతలు పార్టీ వీడకుండా ఉండేలా చూసుకోవడం చంద్రబాబుకు పెద్ద పరీక్షగా మారనుందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి మరోసారి టీడీపీ నుంచి వైసీపీలోకి మొదలైన వలసలు... టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద పరీక్షగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: June 9, 2020, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading