వైసీపీ కీలక నేతకు ఆ పదవి ఇవ్వనున్న జగన్

వైసీపీని బలోపేతం చేసేందుకు ఎంతగానో కష్టపడిన వైవీ సుబ్బారెడ్డికి పార్టీ అధికారంలోకి వస్తే ఏ పదవి ఇవ్వాలనే దానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: May 13, 2019, 11:27 AM IST
వైసీపీ కీలక నేతకు ఆ పదవి ఇవ్వనున్న జగన్
వైెఎస్ జగన్మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కీలక నేతలకు ఎలాంటి పదవులు వస్తాయనే దానిపై ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొందరు కీలక నేతలకు మంత్రి పదవులతో పాటు కేంద్రంలో చేరితే మంత్రి పదవులు కూడా దక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాలుగేళ్లకు పైగా వైసీపీలో కీలక పాత్ర పోషించి... ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకోలేకపోయిన ఒంగోలు మాజీ ఎంపీ, జగన్ సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి పరిస్థితి ఏమిటనే దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. తనకు ఒంగోలు ఎంపీ టికెట్ నిరాకరించినప్పటి నుంచే వైవీ సుబ్బారెడ్డి లోటస్ పాండ్‌కు దూరంగా ఉంటున్నారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.

అయితే తన కోసం, తన పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన వైవీ సుబ్బారెడ్డికి పార్టీ అధికారంలోకి వస్తే ఏ పదవి ఇవ్వాలనే దానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డి కోసం తన ఎంపీ సీటును వదులుకున్న వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు ఖాయమని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వైవీ సుబ్బారెడ్డికి ఇప్పటికే జగన్ స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారని తెలుస్తోంది. మొదట టీటీడీ బోర్డు చైర్మన్ పదవి... ఆ తరువాత పరిస్థితిని బట్టి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటును వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చే యోచనలో వైసీపీ అధినేత ఉన్నట్టు సమాచారం.

Published by: Kishore Akkaladevi
First published: May 13, 2019, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading