HOME » NEWS » politics » YS JAGAN MOHAN REDDY MAY OFFER MINISTER POST FOR NELLORE RURAL YSRCP MLA ANIL KUMAR YADAV IF HE DEFEAT AP MINISTER NARAYANA AK

ఏపీ మంత్రిని ఓడిస్తే ఆ వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ?

వైసీపీకి మంచి పట్టున్న నెల్లూరు జిల్లా నుంచి అమాత్యయోగం ఎవరికి ఉంటుందనే దానిపై వైసీపీ వర్గాల్లోనూ భిన్నమైన చర్చ జరుగుతోంది. గతంలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణరెడ్డికి సేవలను వైసీపీ అధినేత వినియోగించుకున్నారనే ప్రచారం ఓ వైపు సాగుతుండగానే... జగన్‌ను నమ్మి ఆయన వెంటే ఉన్న తమకు కూడా న్యాయం జరుగుతుందని మరికొందరు నేతలు నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 3, 2019, 4:15 PM IST
ఏపీ మంత్రిని ఓడిస్తే ఆ వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ ఎన్నికల్లో విజయం తమదే అని ధీమాగా ఉన్న వైసీపీ నేతలు... పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. మంత్రి పదవుల విషయంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినప్పటికీ... అన్ని రకాలుగా లెక్కలు వేసుకుంటూ తమకు మంత్రి పదవి గ్యారంటీ అనే భావనలో ఉన్నారు కొందరు నేతలు. ఇక వైసీపీకి మంచి పట్టున్న నెల్లూరు జిల్లా నుంచి అమాత్యయోగం ఎవరికి ఉంటుందనే దానిపై వైసీపీ వర్గాల్లోనూ భిన్నమైన చర్చ జరుగుతోంది. గతంలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణరెడ్డి సేవలను వైసీపీ అధినేత వినియోగించుకున్నారనే ప్రచారం ఓ వైపు సాగుతుండగానే... జగన్‌ను నమ్మి ఆయన వెంటే ఉన్న తమకు కూడా న్యాయం జరుగుతుందని మరికొందరు నేతలు నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే సామాజిక సమీకరణాలతో పాటు టీడీపీ తరపున బలమైన అభ్యర్థితో తలపడుతున్న నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గెలిస్తే... కచ్చితంగా జగన్ కేబినెట్‌లో మంత్రి అవుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా అత్యంత బలమైన అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్న ఏపీ మంత్రి నారాయణతో ఈ సారి ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అనిల్ కచ్చితంగా గెలుస్తాడని భావిస్తున్న అతడి అనుచరులు... గెలిస్తే తమ నేతకు మంత్రి పదవి ఖాయమని ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది.

బీసీల్లో కీలకమైన యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం అనిల్ కుమార్ యాదవ్‌కు కలిసొస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు మొదటి నుంచి జగన్‌తోనే ఉండటం ఆయనకు కలిసొచ్చే మరో అంశం. నెల్లూరు జిల్లాలో రెడ్డి వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉండటం... వారిలో చాలామంది మంత్రి పదవి ఆశిస్తుండటంతో... మధ్యేమార్గంగా జగన్ అనిల్ కుమార్ యాదవ్‌కు కేబినెట్‌లో చోటు కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల్లో మంత్రితో పోరాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే... ఆయనపై గెలిచి అమాత్య పదవి దక్కించుకుంటాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by: Kishore Akkaladevi
First published: May 3, 2019, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading