శాసనమండలిలో పంతం నెగ్గించుకున్న జగన్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైసీపీ ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టింది.

news18-telugu
Updated: January 21, 2020, 7:03 PM IST
శాసనమండలిలో పంతం నెగ్గించుకున్న జగన్ ప్రభుత్వం
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైసీపీ ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఉదయం నుంచి జరిగిన హైడ్రామా తర్వాత మండలి చైర్మన్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరూ బిల్లులను ప్రవేశపెట్టారు.

ఏపీ శాసనసభ ఆమోదం పొందిన రెండు బిల్లులను శాసనమండలిలో కూడా ఆమోదింపజేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. అయితే, టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రూల్ నెంబర్ 71 ప్రకారం తాము ప్రతిపాదించిన అంశంపై తొలుత చర్చించాలని ప్రతిపక్ష టీడీపీ పట్టుబట్టింది. అయితే, రూల్ 71 సరికాదని, ముందు ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలంటూ వైసీపీ నేతలు ఉదయం నుంచి పట్టుబట్టారు. ఈ క్రమంలో ఉదయం నుంచి సుమారు 15 మంది మంత్రులు శాసనమండలికి వెళ్లి తమ వాదనలు వినిపించారు. అదే సమయంలో టీడీపీ కూడా సభలో ఆందోళన చేసిింది. ఈ క్రమంలో శాసనమండలి పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏడు గంటల హైడ్రామా అనంతరం సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు చైర్మన్ షరీఫ్ అంగీకరించారు.

 

మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్సీలతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలతో రహస్యంగా చర్చిస్తున్నారు. ఒకవేళ బిల్లుల మీద ఓటింగ్ జరిపితే అందుకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. లేదా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. అయితే, టీడీపీ ఎమ్మెల్సీల్లో విభజన తీసుకొచ్చేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి వారిలో చీలక తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు