ఏపీలో మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు

ఏపీలో మాల, మాదిగ, రెల్లి సామాజికవర్గాల వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

news18-telugu
Updated: August 25, 2019, 10:06 PM IST
ఏపీలో మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
news18-telugu
Updated: August 25, 2019, 10:06 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ మాల వెల్ఫేర్ కార్పోరేషన్, ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పోరేషన్, ఏపీ రెల్లి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసింది. మాదిగలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఒక్క మాదిగలకే కాదు.. రాష్ట్రంలోని అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ క్రమంతో తాజాగా మూడు కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక కార్పోరేషన్ లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...