అమరావతిపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. కమిటీ నియామకం

అమరావతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: September 13, 2019, 4:31 PM IST
అమరావతిపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. కమిటీ నియామకం
వైఎస్ జగన్
news18-telugu
Updated: September 13, 2019, 4:31 PM IST
అమరావతి విషయం ఆంధ్రప్రదేశ్‌లో పెనుదుమారాన్ని సృష్టిస్తోంది. అయితే, దీనిపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసులో ఏముందనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. తాజాగా, అమరావతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రొఫెసర్ మహావీర్, అంజలీ మోహన్, శివానందస్వామి, కేటీ రవీంద్రన్, డాక్టర్ అరుణాచలం సభ్యులుగా ఉంటారు. వీరంతా పట్టణాభివృద్ది రంగంలో నిపుణులే. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వనుంది. ఈ కమిటీ ఆరు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. దీంతోపాటు పర్యావరణం, వరదల నియంత్రణలో నిపుణులైన వారిని కమిటీలో కో ఆప్షన్ సభ్యుడిగా నియమించుకోవచ్చని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అమరావతిలో వరదలు వచ్చినప్పుడు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని, వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలించాలనే ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. దీంతోపాటు అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో కూడా గందరగోళం నెలకొంది. వారిలో కొందరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కూడా కలసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అమరావతిలో పర్యటించి వారికి భరోసా ఇచ్చారు.

ఇవన్నీ ఎలా ఉన్నా, అసలు అమరావతి విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసులో ఏముంది? ఆయన మన్ కీ బాత్ ఏంటి? రాజధానిని అమరావతి నుంచి మారుస్తారా? లేకపోతే కేవలం పరిపాలన నిర్మాణాల వరకే పరిమితం చేస్తా? అప్పుడు రైతులకు పరిహారం ఎలా ఇస్తారనే పలు సందేహాలు వచ్చాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...