‘చంద్రబాబు ప్రాజెక్టులపై’ తవ్వకాలు ఆరంభం.. జగన్ నిపుణుల కమిటీ ఇదే

పరిపాలనలో మరింత పారదర్శకత తీసుకురావడానికి, ప్రాజెక్టుల్లో అవినీతి లేకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: June 14, 2019, 9:59 PM IST
‘చంద్రబాబు ప్రాజెక్టులపై’ తవ్వకాలు ఆరంభం.. జగన్ నిపుణుల కమిటీ ఇదే
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
news18-telugu
Updated: June 14, 2019, 9:59 PM IST
చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుపై సమీక్ష జరిపేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు నిపుణుల కమిటీని నియమించింది. ఎనిమిది మంది సభ్యులతో ఈ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో ఏడుగురు సభ్యులు, ఓ కన్వీనర్ ఉంటారు. పరిపాలనలో మరింత పారదర్శకత తీసుకురావడానికి, ప్రాజెక్టుల్లో అవినీతి లేకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు ఈ కమిటీ సమీక్ష ఉపయోగపడనుంది. ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుంది.

కమిటీ సమీక్ష జరిపే అంశాలు..
1. 25 శాతం కంటే తక్కువ పనులు పూర్తయిన ప్రాజెక్టులు

2. ప్రాజెక్టు వ్యయంలో 25శాతం నిధులు ఖర్చు చేయనివి
2. ఒప్పందాలు కుదరకుండా వర్క్ ఆర్డర్స్ ఇచ్చిన ప్రాజెక్టులు


3. ఒప్పందాలు కుదిరి, వర్క్ ఆర్డర్స్ ఇచ్చినా పనులు సాగని ప్రాజెక్టులు
4. పనులు చేపట్టని ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన చర్యలు, రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వానికి సూచనలు చేయనున్న కమిటీ
Loading...
5. ప్రాజెక్టు వ్యయం పెంచినవి, నిధులు దారి మళ్లించినవి (ఒకవేళ ఉంటే)
6. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి జారీ అయిన ప్రత్యేక జీవోలు, మెమోలు
7. కమిటీ అవసరం అని భావిస్తే ఓ సబ్ కమిటీ, టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తుంది.
8. మరింత మంది నిపుణుల సలహాలు అవసరం అని భావిస్తే, ఆ కమిటీ సమావేశాలకు వారిని పిలిచి చర్చించవచ్చు.

ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ

అబ్దుల్ బషీర్, చీఫ్ ఇంజినీర్ (రిటైర్డ్), సభ్యుడు
ఎల్.నారాయణరెడ్డి, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (రిటైర్డ్), సభ్యుడు
పి.సూర్యప్రకాష్, ప్రముఖ కాస్ట్ ఇంజినీర్, సభ్యుడు
పి.సుబ్రమణ్య శర్మ, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (రిటైర్డ్), సభ్యుడు
ఎఫ్‌సీఎస్ పీటర్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (రిటైర్డ్), సభ్యుడు
ఆదిశేషు, ఏపీ జెన్‌కో డైరెక్టర్ (రిటైర్డ్), సభ్యుడు
ఐఎస్ఎన్ రాజు, చీఫ్ ఇంజినీర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (రిటైర్డ్), సభ్యుడు
చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్, నీటిపారుదల శాఖ, కన్వీనర్
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...