విజయం మనదే... విజయసాయిరెడ్డిని హగ్ చేసుకున్న వైఎస్ జగన్

మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా విజయోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. పలుజిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది.

news18-telugu
Updated: May 23, 2019, 12:04 PM IST
విజయం మనదే... విజయసాయిరెడ్డిని హగ్ చేసుకున్న వైఎస్ జగన్
విజయసాయిరెడ్డిని హగ్ చేసుకున్న జగన్
  • Share this:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో సునామీ సృష్టించారు. 150కు పైగా స్థానాల్లో వైసీపీ దూసుకెళ్తోంది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. పార్టీ అధినేత జగన్... ఎంపీ విజయసాయిరెడ్డితో గెలుపు సంబరాలు జరుపుకున్నారు. తాడేపల్లిలోని కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న సమయంలో పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలుపొందుతున్న నేపథ్యంలో ఆయన సాయిరెడ్డిని గట్టిగా కౌగిలించుకున్నారు. విజయనం మనదే అన్న ఆనందంలో మునిగి తేలారు. జగన్ చిరునవ్వులు చిందిస్తూ.. విజయసాయిరెడ్డిని అమాంతం హగ్ చేసుకున్నారు.

మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా విజయోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. పలుజిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఎక్కడికక్కడ పార్టీ నాయకులంతా సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చుుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీంతో పార్టీ శ్రేణులంతా స్వీట్స్ తినిపించుకుంటున్నారు. డప్పులు, న‌ృత్యాలతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అటు తాడేపల్లితో పాటు... ఇటు కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ వద్ద కూడా పండగ వాతావరణం నెలకొంది. తాడేపల్లిలో జగన్ నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు చేరుకుంటున్నారు.
First published: May 23, 2019, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading