ఆ సర్వేలో మూడో బెస్ట్ సీఎంగా జగన్.. కేసీఆర్ ర్యాంక్ ఎంతంటే..

వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానం దక్కించుకున్నారు.

news18-telugu
Updated: August 15, 2019, 10:52 PM IST
ఆ సర్వేలో మూడో బెస్ట్ సీఎంగా జగన్.. కేసీఆర్ ర్యాంక్ ఎంతంటే..
జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెస్ట్ సీఎంల్లో టాప్ 3 ప్లేస్‌ దక్కించుకున్నారు. దేశ్‌ కా మూడ్ పేరుతో వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన ఓ సర్వేలో జగన్ మోహన్ రెడ్డి.. కేసీఆర్ కంటే ముందంజలో నిలిచారు. లిస్టులో నవీన్ పట్నాయక్ అందరికంటే ముందున్నారు. నవీన్ పట్నాయక్ (81), యోగి ఆదిత్యనాథ్ (72), వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (71), మనోహర్ లాల్ ఖట్టర్ (68), కేసీఆర్ (65) పాయింట్లతో వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. దేశ్ కా మూడ్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 11,252 మంది పాల్గొన్నట్టు ఆ సంస్థ తెలిపింది. అందులో ఓటర్లు 10,098 మంది. ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 14 వరకు ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 14 రాష్ట్రాల్లో సర్వే చేశారు. మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు నవరత్నాలు పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి పనితీరు మీద ప్రజలు ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తీసేసి, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 74 శాతం మంది సమర్థించారు. 13 శాతం మంది విబేధించారు.
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...