వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి నిర్ణయానికి సీఎం జగన్ స్వస్తి పలుకుతారా..?

2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. జగన్ తండ్రి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మండలిని పునరుద్ధరించారు. అది.. 2007 మార్చి 30న కొలువుదీరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మండలి కొనసాగుతూనే వచ్చింది.

news18-telugu
Updated: January 22, 2020, 8:04 AM IST
వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి నిర్ణయానికి సీఎం జగన్ స్వస్తి పలుకుతారా..?
వైఎస్ఆర్, వైఎస్ జగన్ (ఫైల్)
  • Share this:
సీఎం జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 3 రాజధానుల బిల్లుకు శాసన మండలిలో టీడీపీ అడ్డుపడుతోంది. ఆ అడ్డు తొలగాలంటే మండలినే రద్దు చేయాలన్న యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ రోజు రాత్రి మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారని, ఆ భేటీలో మండలి రద్దుకు నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జోరందుకుంది. అయితే.. మండలిని రద్దు చేయాలంటే విధాన సభ ఆమోదించి, పార్లమెంటుకు పంపాలి. అక్కడ ఇరు సభల్లో ఆమోదం పొందితే శాసన మండలి రద్దవుతుంది. వాస్తవానికి 1985లో అప్పటి సీఎం ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారు. ఆ తర్వాత 1990లో మండలిని పునరుద్ధరించాలని అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. మళ్లీ.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. జగన్ తండ్రి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మండలిని పునరుద్ధరించారు. అది.. 2007 మార్చి 30న కొలువుదీరింది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు మండలి కొనసాగుతూనే వచ్చింది. ఉమ్మడి ఏపీలో, విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో శాసన మండలి కొనసాగింది. అయితే.. జగన్ అధికారం చేపట్టాక మండలిలో పలు బిల్లులను ఆమోదింప జేసుకునేందుకు టీడీపీ అడ్డుపడుతోంది. ఆ చర్యలు సీఎంకు విసుగు తెప్పించేలా మారాయి. దాని ప్రభావంతో మండలిని సీఎం జగన్ రద్దు చేస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. తాజాగా.. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో టీడీపీ అడ్డు తగలడంతో ఇక లాభం లేదనుకొని మండలిని రద్దు చేయాలని సీఎం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జగన్ ఆ సంచలన నిర్ణయమే తీసుకుంటే.. తండ్రి నిర్ణయానికి ఎండ్ కార్డు వేసినట్లే అవుతుంది.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు