జగన్ తెచ్చిన మూడు పథకాలు ఇవే... నారా లోకేష్ కొత్త భాష్యం...

‘జగన్ మూడు కార్యక్రమాలు ప్రెవేశపెట్టారు. ఒకటి వైసీపీ కలరింగ్ స్కీం, రెండోది వైసీపీ భాష, మూడోది వైసీపీ కక్ష సాధింపు కార్యక్రమం’ అని లోకేష్ అన్నారు.

news18-telugu
Updated: February 19, 2020, 10:08 PM IST
జగన్ తెచ్చిన మూడు పథకాలు ఇవే... నారా లోకేష్ కొత్త భాష్యం...
నారా లోకేష్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీద టీడీపీ నేత నారా లోకేష్ సెటైర్లు వేశారు. టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో భాగంగా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ పాలన మీద విరుచుకుపడ్డారు. జగన్ మూడు స్కీంలు తెచ్చారంటూ కొత్త భాష్యం చెప్పారు. ‘జగన్ మూడు కార్యక్రమాలు ప్రెవేశపెట్టారు. ఒకటి వైసీపీ కలరింగ్ స్కీం, రెండోది వైసీపీ భాష, మూడోది వైసీపీ కక్ష సాధింపు కార్యక్రమం’ అని లోకేష్ అన్నారు. రూ.1300 కోట్లతో చంద్రబాబు నిర్మించిన పంచాయతీ భవనాలకు, స్కూల్స్, స్మశానాలు, ఆఖరికి మరుగుదొడ్లకు వైసీపీ రంగులు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై హైకోర్టు చివాట్లు పెట్టడంతో ఇప్పుడు ఇంకో రంగు వెయ్యడానికి మరో రూ.1,300 కోట్లు ప్రజా ధనం వృధా చేస్తున్నారని చెప్పారు.

kodali nani,kodali nani speech,kodali nani assembly speech,nara lokesh,kodali nani lokesh,ap news,telugu news,కొడాలి నాని,నారా లోకేష్, కొడాలి నాని ప్రసంగం
కొడాలి నాని, నారా లోకేష్


వైసీపీ వాళ్లు కొత్త భాషను ప్రవేశపెట్టారని విమర్శించారు. తెలుగులో నాన్న అంటామని, ఇంగ్లీష్‌లో ఫాదర్ అంటామని, కానీ వైసీపీ భాషలో మాత్రం ‘నీ అమ్మ మొగుడు అంటారు’ అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ ప్రవేశపెట్టిన మరొకటి ‘కక్ష సాధింపు కార్యక్రమం’ అని లోకేష్ అన్నారు. ఈ పథకం కింద తెలుగు దేశం పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టడం, భద్రత తగ్గించారన్నారు.

amaravati protests ap police detains nara lokesh at guntur toll plaza
గుంటూరులో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో నారా లోకేష్ (File)


ప్రజా వేదిక కూల్చివేతతో తుగ్లక్ పాలన ప్రారంభం అయ్యిందన్నారు. 9నెలల్లో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని, ప్రతిపక్ష పార్టీ పై కక్ష సాధింపు ఫుల్లు... అభివృద్ధి ,సంక్షేమం నిల్లుగా ఉందని లోకేష్ ఎద్దేవా చేశారు. 9 నెలల్లో ప్రజల్ని ముంచే కార్యక్రమాలు తప్ప ఒక్క మంచి కార్యక్రమం లేదన్నారు. ‘మహిళల్ని మోసం చేసారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అని చెప్పి ఇవ్వలేదు. డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేసేస్తా అన్నారు ఒక్క రూపాయి మాఫీ అయ్యిందా?. వృద్ధులను దగా చేసారు. రూ.3 వేల పెన్షన్ అన్నారు రూ.250 పెంచారు. 7 లక్షల పెన్షన్లు తీసేసారు. 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసారు. ఆఖరికి దివ్యాంగులు పెన్షన్లు తీసేశారు. రైతులను ముంచేసారు. విత్తనాలు కూడా ఇవ్వలేని ఉత్తుత్తి ప్రభుత్వం ఇది.’ అని లోకేష్ అన్నారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: February 19, 2020, 10:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading