• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YS JAGAN GOVT TRYING TO SAVE RAPE ACCUSED IN KURNOOL ALLEGES NARA LOKESH BA

రేప్ కేసులో జగన్ సన్నిహితుడు, కేసు నుంచి తప్పించే కుట్ర: నారా లోకేష్

రేప్ కేసులో జగన్ సన్నిహితుడు, కేసు నుంచి తప్పించే కుట్ర: నారా లోకేష్

నారా లోకేష్ ట్వీట్ చేసిన ఫొటో (Image; Nara Lokesh/Tweet)

అత్యాచార కేసులో నిందితుడు అయిన తన సన్నిహితుడిని కాపాడేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు.

  • Share this:
    అత్యాచార కేసులో నిందితుడు అయిన తన సన్నిహితుడిని కాపాడేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, అందుకోసం సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి బాధితురాలిని బెదిరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. అందులో ఓ ఫొటోను జోడించారు. ఆ ఫొటోలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పక్కన నిలబడి ఉన్న వ్యక్తికి రౌండ్ చేసి ఉంది. అలాగే, బాధితురాలితో పోలీసలు మాట్లాడుతున్న ఫొటో, బాధితురాలు మీడియాతో మాట్లాడుతున్నట్టుగా ఉంది.  ‘క‌ర్నూలు జిల్లా దేవన‌కొండ మండ‌లం, జి. పాల‌కుర్తిలో రాజ‌కీయ‌ క‌క్ష‌ల‌తో జ‌గ‌న్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌రెడ్డి బాలిక‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డిన కేసులో A5 ముద్దాయి. ఆయనను కేసు నుండి తప్పించేందుకు ప్ర‌భుత్వ‌ పెద్ద‌లే రంగంలోకి దిగి బాధితురాలిని బెదిరించ‌డం జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌క‌ పాల‌నకి నిద‌ర్శ‌నం. నిందితుడిని అరెస్టు చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నాను.’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.



    కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పాలకుర్తి గ్రామానికి చెందిన 15 సంవత్సరాల మీద సామూహిక అత్యాచారం జరిగిందంటూ ప్రచారం జరిగింది. నిందితులు ఆ బాలిక నోట్లో పురుగు మందు పోసి పరారయ్యారని చెబుతూ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, వారిని గుర్తు పట్టకుండా మొహానికి నల్లరంగు పూసుకున్నారని ఫిర్యాదు చేశారు. అయితే అసలు ఆ బాలిక మీద అత్యాచారం జరగలేదని, పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చారని డోన్ డీఎస్పీ పేర్కొన్నారు. అత్యాచారం జరగకపోయినా జరిగినట్టు ఫిర్యాదు చేశారని ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: