
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)
ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో టీటీడీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.జీవో ప్రకారం.. ఇకపై టీటీడీలో జరిగే ప్రతీ నియామకం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిందేనని అందులో పేర్కొన్నారు.
టీటీడీకి సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఉన్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం జీవో.2323 జారీ చేసింది.ఈ నేపథ్యంలో నేటి రాత్రికల్లా టీటీడీ నుంచి 60మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఆలయ ప్రత్యేక అధికారి హోదాలో కొనసాగుతున్న డాలర్ శేషాద్రిని కూడా తొలగించే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆయనకు ప్రత్యామ్నాయంగా ఎవరిని నియమించాలన్న దానిపై స్పష్టత లేకపోవడంతో.. ప్రస్తుతానికి ఆయన్నే కొనసాగించాలా? అన్న దానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. ఇకపై టీటీడీలో జరిగే ప్రతీ నియామకం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిందేనని అందులో పేర్కొన్నారు.ఏదేమైనా ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో టీటీడీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరెవరి ఉద్యోగాలు ఊడిపోనున్నాయన్నది ఈ సాయంత్రానికి క్లారిటీ రానుంది.
Published by:Srinivas Mittapalli
First published:October 31, 2019, 12:27 IST