చంద్రబాబు మెడకు ‘సిట్‌’ను చుట్టిన సీఎం జగన్...

2014 నుంచి 2019 మధ్య నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

news18-telugu
Updated: February 21, 2020, 10:31 PM IST
చంద్రబాబు మెడకు ‘సిట్‌’ను చుట్టిన సీఎం జగన్...
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
2014 నుంచి 2019 మధ్య నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు అన్నింటిపైనా సమగ్రంగా విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు జరపనుంది. ఇంటెలిజెన్స్ ఐటీ కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల సిట్ బృందం వీటిని విచారించనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం


ఆ జీవోలో పేర్కొన్న ప్రకారం ఎవరినైనా విచారణకు పిలిచే, ప్రశ్నించే అధికారం సిట్‌కు ఉందంటూ జీవో జారీ చేసింది. అవినీతికి ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసి, చార్జ్ షీట్‌లు ఫైల్ చేసే అధికారం కూడా సిట్‌కు ఉంది. అవన్నీ నమోదు చేయడానికి, దాన్ని ఓ పోలీస్ స్టేషన్‌లో నోటిఫై చేస్తారు.  అన్ని శాఖల అధికారులు సిట్‌కు సంపూర్ణ సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఏవైనా భూ రికార్డులు అవసరం అయితే, వారికి అందించాలని సూచించింది.

ప్రభుత్వం జారీ చేసిన జీవో
చంద్రబాబు సీఎంగా ఉన్న సమంయలో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న కార్మిక శాఖలో అవినీతి జరిగింది. తెలంగాణ తరహాలో ఈఎస్ఐలో మందుల కొనుగోల్ మాల్ జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అంతకు ముందు విశాఖలో భారీ ఎత్తున భూ కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో ఇప్పటికే ఓ సిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతోపాటు కొన్ని రోజుల క్రితం సీఆర్డీఏ పరిధిలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు