అమరావతిపై జగన్ మరో సంచలన నిర్ణయం.. సింగపూర్‌‌తో ఆ ఒప్పందం రద్దు..

రాజధానిలో స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ రద్దు చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: November 11, 2019, 11:11 PM IST
అమరావతిపై జగన్ మరో సంచలన నిర్ణయం.. సింగపూర్‌‌తో ఆ ఒప్పందం రద్దు..
వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధానిలో 6.84 చ.కిమీ ల అభివృద్ధి కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగపూర్ కంపెనీల మధ్య ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సింగపూర్ కంపెనీలు పరస్పర అంగీకారంతో అమరావతి డెవలప్మెంట్ ప్రొజెక్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1,691 ఎకరాల్లో మూడు దశల్లో స్టార్ట్ అప్ ఏరియాను అభివృద్ధి చేసేలా చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.

సింగపూర్‌తో ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతాన్ని అమరావతి నుంచి తప్పించి మరోచోటికి తరలిస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ అంశంపై సీఎం జగన్ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం అప్పుడప్పుడు రాజధాని తరలింపు ఉంటుందనే సంకేతాలు పంపుతున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై ఓ నిపుణుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ప్రజల నుంచి సూచనలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...