• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YS JAGAN GOVT APPOINTS PRASHANT KISHOR IPAC TEAM MEMBER BRAHMANDA PATRA AS CHIEF DIGITAL DIRECTOR BA

జగన్ సర్కారులోకి పీకే టీమ్ మెంబర్.. కీలక బాధ్యతలు

జగన్ సర్కారులోకి పీకే టీమ్ మెంబర్.. కీలక బాధ్యతలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిశోర్

ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో కీలకంగా పనిచేసిన వ్యక్తికి ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగించడం వెనుక జగన్ వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఇద్దరు చీఫ్ డిజిటల్ డైరెక్టర్లను నియమించింది. సీవీ రెడ్డి, బ్రహ్మానంద పాత్ర అనే ఇద్దరిని ఏపీ ప్రభుత్వంలో చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమిస్తున్నట్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచార పౌర సరఫరాల శాఖలో సోషల్ మీడియా విభాగంలో వారు విధులు నిర్వహిస్తారు. గతంలోనే గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అనే వ్యక్తిని కూడా చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా జగన్ ప్రభుత్వం నియమించింది. తాజాగా నియమితులైన ఇద్దరిలో బ్రహ్మానంద పాత్ర అనే వ్యక్తి ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ టీమ్ సభ్యుడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డిజిటల్ సపోర్ట్, స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా క్యాంపెయినింగ్‌లో కీలక పాత్ర పోషించారు. జగన్ టూర్లపై పాటలు విడుదల చేయడం, ప్రత్యర్థి పార్టీలను కౌంటర్ చేయడం, వారి వ్యాఖ్యలకు దీటుగా బదులివ్వడం లాంటి బ్యాక్ గ్రౌండ్ వ్యవహారాలను నిర్వహించేవారు.

    సీవీ రెడ్డి, బ్రహ్మానంద పాత్రను చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు


    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశాంత్ కిశోర్ బీహార్ వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి వైసీపీకి ఐప్యాక్ ప్రత్యక్షంగా ఎలాంటి సేవలు అందించడం లేదు. ఈక్రమంలో మరోసారి ఐప్యాక్‌లో ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో కీలకంగా పనిచేసిన బ్రహ్మానంద పాత్ర అనే వ్యక్తికి ప్రభుత్వంలో సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించడం వెనుక జగన్ వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు.

    ఆ తండ్రికి సలాం కొట్టాల్సిందే... కొడుకును ఎలా కాపాడాడో చూడండి

    First published:

    అగ్ర కథనాలు