Home /News /politics /

YS JAGAN GOVT ADVISOR SAJJALA RAMAKRISHNA REDDY SLAMS TDP CHIEF CHANDRABABU OVER KUPPAM MUNICIPAL ELECTIONS MKS

kuppam : చంద్రబాబు చరిత్ర ముగిసింది -కుప్పంలో జెండా పాతిన జగన్ పార్టీ: సజ్జల

కుప్పం మున్సిపాలిటీ

కుప్పం మున్సిపాలిటీ

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలో జగన్ జెండా పాతేశారని, పరిషత్ ఎన్నికల్లాగే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ ఆ విషయం రుజువవుతుందని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలోని మిగతా మున్సిపాలిటీల్లో పోలింగ్ దాదాపు ప్రశాంతంగా జరగ్గా, టీడీపీ చీఫ్ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం ఉద్రిక్తతలు తలెత్తాయి..

ఇంకా చదవండి ...
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు   (muncipal elections in ap)సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదాలు, విమర్శలు కొనసాగుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, కుప్పం, దర్శి, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, మున్సిపాలిటీల్లో సోమవారం నాడు పోలింగ్ జరిగింది. కాగా, కుప్పం మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చెందిన తర్వాత జరుగుతోన్న తొలి ఎన్నికలు కావడంతో అక్కడ టీడీపీ, వైసీపీలు ఆల్మోస్ట్ కొట్లాడుకున్నారు. అమరావతి నుంచి నేతలు సైతం యుద్ధభాషలో మాట్లాడుతుండటం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందన్న చంద్రబాబు  (Chandrababu) ఆరోపణలకు జగన్ సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. కుప్పంలో జగన్ జెండా ఎగరడంతోనే చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిందని సజ్జల అన్నారు.

ఏపీలోని మిగతా మున్సిపాలిటీల్లో పోలింగ్ దాదాపు ప్రశాంతంగా జరగ్గా, టీడీపీ చీఫ్ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం ఉద్రిక్తతలు తలెత్తాయి. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఉదయమంతా ఆందోళనలు జరగ్గా, మధ్యాహ్నం నుంచి దొంగ ఓట్ల వ్యవహారం తెరపైకొచ్చింది. కుప్పంలో వైసీపీ దాదాపు 8వేల దొంగ ఓట్లను సృష్టించిందని, తమిళనాడుకు చెందిన వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తోందని, అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? లేదా? అని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. దొంగ ఓట్లకు సంబంధించిన కొన్ని వీడియోలనూ ఆయన మీడియాకు ప్రదర్శించారు. అయితే,

చంద్రబాబుపై నారా లోకేశ్ ప్రతీకారం -కుప్పం ఎన్నికల సీన్ ఇదే -rk roja షాకింగ్ కామెంట్స్


కుప్పంలో దొంగ ఓట్లు సృష్టించిన ఘనత చంద్రబాబుదేనని, దశాబ్దాలపాటు కుప్పాన్ని అంటిపెట్టుకున్న చంద్రబాబు స్థానికంగా ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలంతా జగన్ వైపు మొగ్గు చూపుతున్నారని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని, మొత్తంగా బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని, కుప్పంలో పరిషత్ ఎన్నికల్లాగే మున్సిపాలిటీ ఎన్నికలోనూ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, తద్వారా చంద్రబాబు చరిత్రకు ముగింపు పలుకుతామని సజ్జల అన్నారు.

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ ఖతం -గద్దె దించనున్న ఆర్మీ -కారణాలివే -pakistan కొత్త ప్రధాని ఎవరంటే


మొత్తంగా 39వేల ఓట్లున్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికను అదేదో సాధారణ ఎన్నికలాగా చంద్రబాబు ఫీలవుతుండటాన్ని బట్టే ఆయనలోని భయం తెలిసిపోతున్నదని, చంద్రబాబు అనవసరంగా హడావుడి చేస్తున్నాడని, ప్రతి పోలింగ్ బూత్ లోనూ టీడీపీ అభ్యర్థి, ఏజెంట్ ఉండగా అసలు వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు. కుప్పంలో టీడీపీ నేతల అక్రమాలంటూ సజ్జల సైతం కొన్ని వీడియోలు చూపించారు. టీడీపీ, జనసేన ఒకేతాను ముక్కలని, ఈ మున్సిపల ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Chandrababu naidu, Kuppam, Sajjala ramakrishna reddy, Tdp, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు