Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంక్షేమ పథకాలపైనే (AP Welfare Schemes) చర్చ జరుగుతూ వస్తోంది. ప్రతి నెల ఏదో ఒక పథకం రూపంలో ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ వస్తోంది. దీంతో ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరుందని ప్రచారం జరిగింది. ఐతే గత నెలరోజులుగా ఏపీలో ఏ నోట విన్నా విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల (Electricity True-up Charges) గురించే చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడో వాడుకున్న విద్యుత్ కు ఇప్పుడు సర్దుబాటు పేరుతో తమపై భారం మోపడం ఏంటని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలుచేయవలసిన సర్దుబాటు అప్పుడు అమలు చేయకపోవడం వల్ల విద్యుత్ డిస్కమ్ లు నష్టాల బాటపట్టాయని.., ఈ పరిస్థితి డిస్కమ్ లు మనుగడకే ప్రశ్నార్ధకంగా మారాయని, అందువలననే తప్పని సరి పరిస్థితులలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామనేది ప్రభుత్వవాదన.
ఏటికేడు విధ్యుత్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నారని, వీటిపై సుంకం కూడా వసూలు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దల దోపిడీ,ఉద్యోగుల అలసత్వం వల్ల వచ్చే నష్టాలను మళ్ళీ ఇప్పుడు తమపై రుద్దడం ఎంతవరకు సబబని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ట్రూ అప్ బాదుడు ప్రక్కనపెడితే జగన్ సర్కారుకు మొదటి నుండి ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్న ఎస్సీ ఎస్టీ వర్గాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విధ్యుత్ అందిస్తున్నారు.
ఐతే ఇప్పుడు ఒక్కసారిగా ఆయా వర్గాలపై పెండింగ్ బిల్లుల అస్త్రం బయటికి తీయడంతో వేలల్లో బిల్లులు వస్తున్నాయి. పెండింగ్ బిల్లులు, బిల్లులపై సుంకం, ట్రూ అప్ ఛార్జీలు, లేట్ ఫీజులు వీటన్నింటిపై వడ్డి కలుపుకుని బిల్లు వేలల్లో రావడంతో పాటు ఆయా బిల్లులు చెల్లించని వారి విధ్యుత్ కనెక్షన్లు కట్ చేస్తుండటంతో వినియోగదారులు విద్యుత్ సిబ్బందితో వాగ్దావాదానికి దిగుతున్నారు.
ఓట్ల కోసం వచ్చినప్పుడు ఉచిత విధ్యుత్ అంటూ తమని మభ్యపెట్టి అధికారం వచ్చాక పాతబాకీలు వడ్డీతో సహా చెల్లించమంటూ తమపై ఒత్తిడి తీసుకురావడం పట్ల ఆయావర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అదునుగా ప్రతిపక్షాలు జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్నాయి. సీఎం అసమర్ధత వల్లనే రాష్ట్రంలో ఇటువంటి అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, నవరత్నాల పేరుతో జనం సొమ్ము పప్పు బెల్లాలమాదిరిగా పంచడం వల్లనే ఇప్పుడు రాష్ట్ర ఆర్ధికపరిస్థితి దివాళా తీసిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. లోటు పూడ్చుకోవడానికే ఇప్పుడు సామాన్యులపై ఎక్కడ వీలుంటే అక్కడ వడ్డింపులకు పాల్పడుతున్నారని ప్రజలలోకి తీసుకెళ్ళడంలో కొంతమేర విజయం సాధించారు.
జగన్ పాలన ఇలాగే కొనసాగితే మునుముందు రాష్ట్రంలో ఇప్పుడు విధిస్తున్న చేత్త పై సుంఖం,ట్రూ అప్ ఛార్జీల మాదిరిగానే మరుగుదొడ్లపై కూడా సుంఖం విదించినా ఆశ్ఛర్యపోవలసిన పనిలేదంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. సామాన్య ప్రజల పై నేరుగా ప్రభావం చూపే ఇటువంటి ఛార్జీల పెంపు అంశంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయక పోతే రానున్న ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కుతో ప్రభుత్వంపై పిడుగులు కురిపాస్తారంటున్నారు రాజకీయవిశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, ELectricity