టీడీపీ నేత కుమారుడికి సీఎం జగన్ కీలక పదవి..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు సందీప్ కుమార్‌ కోసం సూపర్ న్యూమరీ పోస్టును ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఆయన కోసం పే స్కేల్‌ను కూడా ప్రకటిస్తూ సోమవారం జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 17, 2019, 3:14 PM IST
టీడీపీ నేత కుమారుడికి సీఎం జగన్ కీలక పదవి..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు సందీప్ కుమార్‌ కోసం సూపర్ న్యూమరీ పోస్టును ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఆయన కోసం పే స్కేల్‌ను కూడా ప్రకటిస్తూ సోమవారం జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పే స్కేల్‌ను రూ.40,270-రూ.93,780 నిర్ణయించింది. 2019 జనవరి 31న డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సందీప్ కుమార్ ఆ తర్వాత 72 వారాల ట్రైనింగ్ కోసం విజయనగరం జిల్లా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా వెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఆయన శిక్షణ పూర్తి చేసుకుని, డిప్యూటీ కలెక్టర్ సాధారణ విధుల్లో చేరే వరకు సూపర్ న్యూమరీ పోస్టు కింద విధులు నిర్వర్తించనున్నారు.

కాగా, 2014 మే 16న కిడారి సర్వేశ్వరరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016 ఏప్రిల్ 28న టీడీపీలోకి వెళ్లారు. అయితే, 2018 సెప్టెంబరు 23న ఆయన్ను మావోయిస్టులు హత్య చేశారు. దీంతో సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్ కుమార్‌కు మంత్రి పదవి ఇచ్చిన అప్పటి సీఎం చంద్రబాబు, చిన్న కుమారుడు సందీప్ కుమార్‌కు గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చింది.
First published: September 17, 2019, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading