జగన్ ప్రజాసంకల్పయాత్రకు స్వల్ప బ్రేక్..!

రెండు రోజుల టూర్ తర్వాత తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది.


Updated: September 12, 2018, 7:30 PM IST
జగన్ ప్రజాసంకల్పయాత్రకు స్వల్ప బ్రేక్..!
వైఎస్ జగన్ (ఫైల్ ఫొటో)
  • Share this:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ పడింది. రెండు రోజుల పాటు ఆయన టూర్‌కు విరామం వచ్చింది. 13వ తేదీ వినాయకచవితి పండుగ దృష్ట్యా ఆ రోజు సెలవు ఇచ్చారు. అనంతరం 14వ తేదీ కూడా ఆయన యాత్రకు విరామం ఇచ్చినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈనెల 15వ తేదీ శనివారం నుంచి ప్రజాసంకల్ప యాత్ర తిరిగి కొనసాగుతుంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగన్ వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలతో అభివృద్ధిపరంగా ఇరు రాష్ట్రాలకు, రెండు రాష్ట్రాల ప్రజలకు విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలని కోరుకున్నారు.

ప్రజాసంకల్ప యాత్ర 262 రోజు విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్. అరిలోవలోని బీఆర్టీఎస్ రోడ్డులో మైనారిటీలతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడి నాలుగేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. మైనారిటీలకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...