ఏడాదిలో సీఎం జగన్ చేసింది అదొక్కటే... చర్చకు సిద్ధమా?: చంద్రబాబు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎవరి హయాంలో ఎంత జరిగిందో చర్చకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు.

news18-telugu
Updated: May 28, 2020, 7:12 PM IST
ఏడాదిలో సీఎం జగన్ చేసింది అదొక్కటే... చర్చకు సిద్ధమా?: చంద్రబాబు
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలో అప్పులు మాత్రమే చేశారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సొంత రాబడులు 2018-19 సంవత్సరంలో రూ.62 వేల కోట్లు ఉంటే రూ.58 వేల కోట్లకు తగ్గిపోయిందన్నారు. కేంద్ర రాబడులు రూ. 52 వేల కోట్లు ఉంటే రూ.46 వేల కోట్లకు తగ్గిపోయిందని చెప్పారు. అప్పులు మాత్రం రూ. 43 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్లు పెరిగిందని, అది జగన్ చేసిన అభివృద్ది అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాల కోసం పెట్టిన పార్టీ అని, అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే, జగ్జీవన్ రాం స్పూర్తితో పెట్టిందన్నారు. టీడీపీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, వైసీపీ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన ప్రస్తావించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎవరి హయాంలో ఎంత జరిగిందో చర్చకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. జగన్ ఇచ్చేది గోరంత, చెప్పేది కొండంత అని చంద్రబాబు అన్నారు.

టీడీపీ హయాంలో చేపట్టిన సంక్షేమంపై చంద్రబాబు చెప్పిన వివరాలు..


  • 5 ఏళ్లల్లో రూ.2 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు

  • మొదటి ఏడాదిలో టీడీపీ రూ.35,900 కోట్లు సంక్షేమం కోసం ఖర్చు పెడితే, వైసీపీ

  • రూ.34వేల కోట్లు సంక్షేమానికి పెట్టారు. అందులో 10వేల కోట్లు పక్కదారి మళ్లించారు.

  • అనేక సంస్థల్లో టీడీపీ బీసీలకు కేటాయిస్తే మీరు ఉన్న ఫళంగా తొలగించారు.
  • స్థానిక సంస్థల్లలో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు.

  • నాయీ బ్రాహ్మణులు ఐదున్నర లక్షల మంది ఉంటే కేవలం 38వేల మందికి రూ.10వేలు ఇచ్చి అందరికీ ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

  • డ్రైవర్లు 6 లక్షల మంది ఉంటే లక్షా 80వేల మందికి మాత్రమే ఇచ్చారు.

  • చేనేత కార్మికులకు 3లక్షల మగ్గాలు ఉంటే కేవలం 80 వేలకు మాత్రమే ఇచ్చి అంతా చేసేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

First published: May 28, 2020, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading