టీడీపీలో జనసేన విలీనం.. ఏపీలో కమ్మ రాజ్యం -చంద్రబాబుకు గంగిరెద్దు పవన్ కల్యాణ్: మంత్రి Kodali Nani షాకింగ్ కామెంట్స్

టీడీపీ, జనసేనపై మంత్రి కొడాలి నాని

Kodali Nani on TDP Janasena merge : ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మళ్లీ పొలిటికల్ యాక్టివిటీని పెంచిన క్రమంలో అధికారిక వైసీపీ నుంచి ఎదురుదాడి పెరిగింది. గత వారం వరుస పర్యటనలతో పవన్ జనసైన్యాన్ని హోరెత్తించగా, తాజాగా చంద్రబాబు కుప్పం టూర్ తో తెలుగు తమ్ముళ్లకు భరోసా కల్పించే కల్పించే పనికి పూనుకున్నారు. అయితే, ఈ ఇద్దరూ తోడుదొంగంటలూ జగన్ మంత్రులు దుమ్మెత్తిపోస్తున్నారు. బాబు, పీకేలను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్లు చేశారు..

  • Share this:
విపక్ష పార్టీలు, వాటి నేతలపై ఎదురుదాడి అధికార వైసీపీకి కొత్త కానప్పటికీ, సంచలన వ్యాఖ్యల మంత్రిగా పేరుపొందిన కొడాలి నాని ఈసారి మరో అడుగు ముందుకేశారు. చాలా ఏళ్ల కిందట చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఉద్దేశించి ‘జెండా పీకేద్దాం’ కథనం తరహాలో.. ఆ చిరంజీవి సోదరుడు, పవన్ కల్యాణ్ పార్టీ జనసేనపై మంత్రి అసాధారణ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పవన్ పెంపుడుకొడుకని, టీడీపీలో జనసేన విలీనం కావాలని కొడాలి నాని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ కామెంట్లు చేశారు. వివరాలివి..

కుక్కలు చింపిన విస్తరి..
ఉమ్మడి రాష్ట్రానికి, విడిపోయిన ఏపీకి కలిపి మొత్తం 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఇచ్చినవాటిలో ఒక్కమాటను నిలబెట్టుకోలేని దద్దమ్మగా టీడీపీ అధినేత చంద్రబాబు చరిత్రలో మిగిలిపోయారని వైసీపీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏపీని కుక్కలు చించిన విస్తరిలా మార్చేశాడని, అందుకే జనం టీడీపీకి బుద్ధి చెప్పారని, ఇటీవల స్థానిక ఎన్నికల్లోనూ చంద్రబాబును జనం చిత్తుగా ఓడించారని, ఆ దెబ్బతో బాబు బద్వేలు ఉప ఎన్నికల బరిలో నుంచీ పారిపోయాడని మంత్రి ఎద్దేవా చేశారు.

టీడీపీలో జనసేన విలీనం..
చంద్రబాబుకు తనపై ఉండే నమ్మకం పూర్తిగా పోయిందని, కొడుకు నారా లోకేశ్ ను అసలే నమ్మే పరిస్థితి లేదని, కాబట్టే, టీడీపీని గట్టెక్కించుకోడానికి బాబు తన దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ వైపు చూస్తున్నాడని, విచిత్రం కాకుంటే పీకేకు కూడా మైండ్ బ్లాక్ అయిందని నాని వెక్కిరించారు. ‘చంద్రబాబు చేతిలో పవన్‌ కల్యాణ్‌ గంగిరెద్దు. టీడీపీని జనసేనలో విలీనం చేయాలి.’అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఏపీలో కమ్మరాజ్యం..
‘సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాలను, ప్రత్యేకించి బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెబుతుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే అండగా ఉంటానంటున్నాడు. చంద్రబాబుతో కలిసి ఏపీలో కమ్మరాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా పవన్ పనిచేస్తున్నాడు’అని కొడాలి మండిపడ్డారు. ఏపీలో సంచలనం రేపిన డ్రగ్స్‌ వ్యవహారంలో చంద్రబాబు, కొంతమంది సన్నాసులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మాఫియాతో బంధాలు, ఉత్తరాంధ్ర నుంచి గంజాయి స్మగ్లింగ్‌ లాంటి వ్యవహారాలు చంద్రబాబుకే చెల్లుతాయన్నారు.

పీవీ క్రెడిట్ కొట్టేస్తారా?
చంద్రబాబుపై విమర్శల పరంపరలో డ్వాక్రా సంఘాల అంశాన్ని ప్రస్తావించారు మంత్రి నాని. దేశానికి పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న రోజుల్లో డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయని, వైఎస్సార్‌ హయాంలో అవి మరిత విస్తరించి, మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలిచ్చి ప్రోత్సహించారని గుర్తుచేసిన కొడాలి.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు వెన్నుపోటు పొడిచి, వారి వద్ద డబ్బులు దోచుకున్నారని, డ్వాక్రా సంఘాల చరిత్రలో చంద్రబాబు ఓ మోసగాడిగా నిలిచిపోతాడని అన్నారు. టీడీపీలో జనసేన విలీనమంటూ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్లపై రెండు పార్టీల కార్యకర్తలు మండిపడుతున్నారు.
Published by:Madhu Kota
First published: