44 మందితో బాయ్‌కాట్.. 151 మందితో సీఎంగా రీ ఎంట్రీ.. జగన్‌ కిక్కే వేరు..

అప్పట్లో విపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన జగన్... తిరిగి వైసీపీ ఘనవిజయంతో అధికారంలోకి వచ్చి అసెంబ్లీకి సీఎం హోదాలో అడుగుపెట్టారు.

news18-telugu
Updated: June 12, 2019, 5:58 PM IST
44 మందితో బాయ్‌కాట్.. 151 మందితో సీఎంగా రీ ఎంట్రీ.. జగన్‌ కిక్కే వేరు..
ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్
news18-telugu
Updated: June 12, 2019, 5:58 PM IST
2017 నవంబర్ లో ఏపీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉంటూ శీతాకాల సమావేశాలను బహిష్కరించిన జగన్.. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి సీఎం హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అంతేకాదు తన చిరకాల ప్రత్యర్ధి, అప్పట్లో తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కోవడమే కాకుండా దీనిపై మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వని చంద్రబాబును విపక్షానికి పరిమితం చేసిన వేళ... సభలో జగన్ చాలా ఉల్లాసంగా కనిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 102 స్ధానాలతో అధికారంలోకి రాగా.. వైసీపీ 67 స్థానాలు గెలిచి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆనంతరం జరిగిన పరిణామాల్లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి పేరుతో టీడీపీలోకి ఫిరాయించారు. వీటిపై ఆరంభంలో పోరాటం చేసిన వైసీపీ ఆ తర్వాత ఫిరాయింపులను చూస్తూ మిన్నకుండటం మినహా మరేమీ చేయలేని పరిస్ధితికి చేరుకుంది. దీనికి కారణం అప్పట్లో అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాద్ వైఖరే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడమే కాకుండా దీనిపై అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రయత్నించిన విపక్ష నేత జగన్ మైక్ కట్ చేయడం, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వంటి చర్యలతో కోడెల విమర్శల పాలయ్యారు.

ap assembly session, ap assembly session start date, ap assembly session news, amaravati news, ఏపీ అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఏపీ అసెంబ్లీ తేదీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు


స్పీకర్ కోడెలతో పలుమార్లు సమావేశమైన వైసీపీ నేతలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరి అస్త్రంగా భావించిన అసెంబ్లీ సమావేశాల బహిష్కరణను వైసీపీ తెరపైకి తెచ్చింది. 2017 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటేనే తాము సభకు హాజరవుతామని విపక్ష నేత హోదాలో తేల్చిచెప్పిన జగన్.. అది కుదరకపోవడంతో అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగానూ ఇదే డిమాండ్ ను లేవనెత్తిన వైసీపీ... స్పీకర్ స్పందించకపోవడంతో అసెంబ్లీకి దూరంగా ఉంది. దీంతో 2017లో జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలే జగన్ కు విపక్ష నేతగా చివరి సమావేశాలుగా మిగిలాయి.

all party mlas takes oath in ap assembly, Pics: సభలో వైసీపీ ఎమ్మెల్యేల సందడి.. ఫుల్ జోష్‌లో జగన్
సభలో వైసీపీ ఎమ్మెల్యేల సందడి.. ఫుల్ జోష్‌లో జగన్
అప్పట్లో విపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన జగన్... తిరిగి వైసీపీ ఘనవిజయంతో అధికారంలోకి వచ్చి అసెంబ్లీకి సీఎం హోదాలో అడుగుపెట్టారు. దీంతో తొలి అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజున జగన్ ఎన్నడూ లేనంత ఉల్లాసంగా కనిపించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి మరీ వారిని ఆప్యాయంగా పలుకరించారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...