• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YS JAGAN BIG FAN MILATARI NAIDU WAS CORDIALLY GREETED NGS

Andhra Pradesh: సీఎం జగన్ ఆత్మీయ ఆలింగనంతో ఉబ్బితబ్బిబ్బయిన మిలటరీ నాయుడు

Andhra Pradesh: సీఎం జగన్ ఆత్మీయ ఆలింగనంతో ఉబ్బితబ్బిబ్బయిన మిలటరీ నాయుడు

సీఎం జగన్ ను చూస్తేనే ఆనందంతో మైమరచిపోతారు కొందరు. అంతటి వీరాభిమానులు ఉన్నారు ఆయనకు.. అలాంటిది జగన్ స్వయంగా కాన్వాయ్ ఆపి తన దగ్గరకు వచ్చి మరి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది అంటున్నారు మిలటరీ నాయుడు

సీఎం జగన్ ను చూస్తేనే ఆనందంతో మైమరచిపోతారు కొందరు. అంతటి వీరాభిమానులు ఉన్నారు ఆయనకు.. అలాంటిది జగన్ స్వయంగా కాన్వాయ్ ఆపి తన దగ్గరకు వచ్చి మరి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది అంటున్నారు మిలటరీ నాయుడు

  • Share this:
    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు.. అతడి కోసం ఏం చేయడానికైనా సిద్ధమనే అభిమానులు కొన్ని వేలల్లో కనిపిస్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో జగన్ వీరాభిమానుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి జగన్ ను చూస్తే చాలు.. తమ డ్రీం నెరవేరినట్టే అనుకుంటారు చాలామంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. పాదయాత్ర సమయంలోనూ జగన్ ను దగ్గరగా చూసి మాట్లాడే అవకాశం చాలామందికి ఉండేది.. కానీ సీఎం అయిన తరువాత ఆయన్ను దగ్గరగా చూసే అవకాశం చాలాకొద్ది మందికే ఉంటుంది. ఒక వేళ జగన్ ను కలిసేందుకు వెళ్లినా.. ఆయన చుట్టూ ఉండే సెక్యూరీటీ.. ప్రొటొకాల్ అడ్డంకులతో అభిమానులు కలిసే అవకాశాలు చాలా అరుదుగానే ఉంటాయి.

    కానీ జగన్ కు వీరాభిమాని అయిన ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం ప్రస్తుతం ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. బుధవారం విశాఖ పర్యటనకు వచ్చారు సీఎం జగన్.. మొదట ఎయిర్ పోర్టు లాంజ్ లో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో సమావేశమైన ఆయన తరువాత.. శారాదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. అయితే జగన్ విశాఖ వస్తున్నారని తెలియడంతో.. ఆయన్ను చూసేందుకు వీరాభిమాని, చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్నినాయుడు అలియాస్ మిలటరీ నాయుడు.. తన కుమారుడు వంశీ సాయంతో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

    కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి అనుమతి లేని వారిని ఎయిర్ దగ్గరకు కూడా అనుమతించ లేదు. దీంతో సాధరణ ప్రయాణికులు వెళ్లే మార్గంలో అంటే.  వీఐపీ లాంజ్‌కు కొద్ది దూరంలో నిలబడి దూరం నుంచి జగన్ ను చూసి సరిపెట్టుకుందాం అనుకున్నారు మిలటరీ నాయుడు. అయితే స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘం నాయకులతో సమావేశం తరువాత వైఎస్‌ జగన్‌ కాన్వాయ్ శారదా పీఠానికి బయలుదేరింది. కాన్వాయ్ లో వెళ్తున్న జగన్ పది అడుగుల దూరం దాటిన తరువాత.. మిలటరీ నాయుడ్ని గమనించారు. వెంటనే సీఎం జగన్ తన కాన్వాయ్ ను ఆపమని చెపన్పారు. తరువాత కాన్వాయ్ దిగి నడుచుకుంటూ మిలటరీనాయుడ్ని పలకరించారు.

    వయసు పెరగడంతో మిలటరీనాయుడి ఆరోగ్యంపై ఆరాతీశారు. తరువాత హృదయ పూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. సీఎం స్థానంలో ఉండి.. తన దగ్గరకు వచ్చి పలకరించినందుకు మిలటరీ నాయుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సీఎంకు తన వారు అంటే ఎంత అభిమానం అంటూ ఆ దృశ్యాన్ని చూసిన వారు చర్చించుకున్నారు. మిలటరీ నాయుడు టీడీపీలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయన దగ్గర నుంచి ఆయన అడుగుజాడల్లో నడస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తరువాత జగన్ వెంట వైసీపీలో కొనసాగుతూ వస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు